నిర్మాణంలో ఉన్న బావిలో ఐదుగురు కార్మికులు దుర్మరణం‌

Workers killed in a well under construction.మేఘాలయ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న బావిలో ప్రమాదవశాత్తు ఐదుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు.

By Medi Samrat
Published on : 30 March 2021 11:25 AM IST

workers killed in a well

మేఘాలయ రాష్ట్రంలో విషాద‌క‌ర‌మైన‌ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ జయంతి హిల్స్‌ జిల్లా జోవాయి పట్టణ శివార్లలోని మిహ్మింట్డు గ్రామంలో నిర్మాణంలో ఉన్న బావిలో ప్రమాదవశాత్తు ఐదుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఘ‌ట‌న‌పై ఫైర్‌ సర్వీస్‌ ఎస్సీ గొయెంకా మాట్లాడుతూ.. గ్రామంలో బావి నిర్మిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌లో మ‌రో ఇద్ద‌రు కార్మికులు అప‌స్మార‌క స్థితిలోకి వెళ్ల‌గా.. అప్ప‌టికే సంఘటనా స్థలానికి చేరుకున్న‌ ప్రత్యేక రెస్క్యూ బృందం ఆ ఇద్దరిని రక్షించింది. ఐదుగురి మృతదేహాలను రెస్క్యూ బృందం 35 మీటర్ల లోతులో ఉన్న బావిలో నుంచి వెలికి తీసినట్లు ఫైర్‌ సర్వీస్‌ ఎస్సీ గొయెంకా తెలిపారు. అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిన ఇద్ద‌రు కార్మికులు చికిత్స పొందుతున్నారని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story