పెళ్లింట విషాదం.. పేలిన గ్యాస్ సిలిండ‌ర్లు.. ఐదుగురు మృతి.. 60 మందికి గాయాలు

5 Dead After Gas Cylinder Explodes At House In Jodhpur.పెళ్లింట విషాదం చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Dec 2022 10:28 AM IST
పెళ్లింట విషాదం.. పేలిన గ్యాస్ సిలిండ‌ర్లు.. ఐదుగురు మృతి.. 60 మందికి గాయాలు

పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండ‌ర్ పేల‌డంతో ఐదుగురు మ‌ర‌ణించారు. మ‌రో 60 మందికి గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లాలో జ‌రిగింది.

జోధ్‌పూర్‌లోని భుంగ్రా గ్రామంలో తఖ్త్ సింగ్ ఇంట్లో పెళ్లి వేడుక జ‌రుగుతోంది. దీంతో బంధువులు అంద‌రూ అత‌డి ఇంటికి చేరుకుని ఎంతో ఆనందంగా వేడుక‌లో పాల్గొంటున్నారు. వివాహ విందు కోసం వంట‌లు సిద్ధం చేస్తుండ‌గా గ్యాస్ లీకే సిలిండ‌ర్లు పేలాయి. దీంతో ఒక్క‌సారిగా మంట‌లు అంటుకున్నాయి. మంట‌లు వేగంగా వ్యాపించాయి. పేలుడు ధాటికి పెళ్లి జ‌రుగుతున్న ఇంటిలోని ఓ భాగం కూలిపోయింది. ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు. అయితే.. అప్ప‌టికే ఇళ్లు ద‌గ్థ‌మైంది. 60 మందికి పైగా గాయ‌ప‌డ‌గా వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. విష‌యం తెలుసుకున్న వెంట‌నే క‌లెక్ట‌ర్ హిమాన్షు గుప్తా ఆస్ప‌త్రికి వెళ్లి బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. బాధితుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశించారు. 42 మందిని ఎంజీహెచ్ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు గుప్తా తెలిపారు. వీరిలో ఆరుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు.

Next Story