పెళ్లికి నో చెప్పిందని.. బాలికపై 47 ఏళ్ల వ్యక్తి అమానుషం.. వీడియో
47 Year Old Man Stubbs 16 Years Old Girl Dragged By Hair For Declining Marriage Proposal. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలికపై 47 ఏళ్ల
By అంజి Published on 20 Feb 2023 9:32 AM IST
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలికపై 47 ఏళ్ల వ్యక్తి పదునైన ఆయుధంతో దాడి చేశాడు. తనతో పెళ్లికి నిరాకరించిందని నడిరోడ్డుపై జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓంకార్ తివారీ అలియాస్ మనోజ్ అనే వ్యక్తి రాయ్‌పూర్‌లోని గుధియారీ ప్రాంతంలో దుకాణం నడుపుతున్నాడు.
గత కొన్ని రోజులుగా అతని షాపులో 16 ఏళ్ల బాలిక పని చేస్తోంది. ఇటీవల వివిధ కారణాల రీత్యా తాను ఉద్యోగం మానేస్తానని ఓంకార్ తివారీకి చెప్పింది. దానికి బాలిక ఒప్పుకోలేదు. శనివారం సాయంత్రం ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి.. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీనికి ఆ బాలిక, బాలిక తల్లి నిరాకరించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి.. బాలికపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. అందరూ చూస్తుండగా బాలిక జట్టుపట్టుకుని రోడ్డుపైకి ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
ఇదికాస్తా వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి భారతీయ శిక్షాస్మృతి (IPC), ఆయుధాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని, వైద్యుల నిరంతర పరిశీలనలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. నింధితుడికి కఠినంగా శిక్షిస్తామని రాయ్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పి) ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు.
ये दरिंदा जो लड़की पर हमला करके सड़क पर घूमा रहा है… मुझे उससे ज़्यादा ग़ुस्सा वहां पर खड़ी मुर्दा जनता को देखकर आ रहा है.
— Vividha (@VividhaOfficial) February 19, 2023
लड़की के सिर और पूरे शरीर पर गड़ासे से वार किया गया और पूरे रायपुर में उसे घसीट गया. डेढ़ घंटे से यह तमाशा चलता रहा और छत्तीसगढ़ पुलिस सोती रही? pic.twitter.com/7uYLCVhYSS