రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో థార్ SUV వాహనం మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. మోటారు సైకిల్ ఢీకొన్నప్పుడు దానిపై భర్త, భార్య, వారి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదం చాలా తీవ్రంగా ఉండటంతో, ఢీకొన్న వెంటనే మోటార్ సైకిల్ మంటల్లో చిక్కుకుంది.
ఈ మరణాలతో ఆగ్రహించిన స్థానికులు థార్ SUV కారును అక్కడికక్కడే తగులబెట్టారు. పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థలంలో అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలో ఒక వాహనం లోయలో పడిపోవడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. చాంద్శాలి ఘాట్ వద్ద ఒక వాహనం లోయలోకి పడిపోవడంతో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడ్డారు. చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై నందూర్బార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.