యువకుడిపై నలుగురు యువతుల అత్యాచారం.. కారులో కిడ్నాప్‌ చేసి మరీ..

4 girls allegedly abduct and rape leather factory laborer while on way back home. ఇటీవల కాలంలో నేరాలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. తాజాగా పంజాబ్‌ రాష్ట్రంలో చోటు చేసుకున్న

By అంజి  Published on  22 Nov 2022 3:18 PM IST
యువకుడిపై నలుగురు యువతుల అత్యాచారం.. కారులో కిడ్నాప్‌ చేసి మరీ..

ఇటీవల కాలంలో నేరాలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. తాజాగా పంజాబ్‌ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఓ ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది. ఓ యువకుడిని నలుగురు యువతులు కిడ్నాప్ చేసి శారీరకంగా వేధించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ వార్త విన్న వారందరూ షాక్ అవుతున్నారు. పంజాబ్‌లోని జలంధర్‌లో నలుగురు అమ్మాయిలు తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని ఓ వ్యక్తి పేర్కొన్న షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం.. అతను ఆ యువతులపై ఎటువంటి ఫిర్యాదు నమోదు చేయలేదు. బాధితుడు లెదర్ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు.

బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అతను ఫ్యాక్టరీ నుండి తిరిగి వస్తుండగా, కారులో వెళ్తున్న నలుగురు అమ్మాయిలు వెనుక నుండి వచ్చి అడ్రస్‌ గురించి ఆరా తీశారని వెల్లడించారు. అప్పుడు వారు అతనికి చిటీ ఇచ్చారని, అతను దానిని చూస్తుండగా, అమ్మాయిలు తన కళ్లలో ఏదో విసిరారని, దాంతో స్పృహ కోల్పోయానని అతను చెప్పాడు. ఇది జరిగిన వెంటనే.. యువతులు తనను బలవంతంగా కారులో కూర్చోబెట్టి, ఆపై అతని చేతులను కట్టివేశారని చెప్పాడు. ఇదంతా జరిగిన తర్వాత గుర్తుతెలియని ప్రదేశంలో కారు ఆపి తనకు డ్రగ్స్ ఇచ్చి నలుగురూ కలిసి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పాడు.

వారు అతనికి బలవంతంగా మద్యం తాగించారు కూడా. తెల్లవారుజామున 3 గంటల సమయంలో నలుగురు అమ్మాయిలు అతన్ని తిరిగి లెదర్ కాంప్లెక్స్ వద్ద దింపారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన యువతుల 22-23 సంవత్సరాల మధ్య ఉంటుందని బాధితుడు చెప్పాడు. నలుగురూ ఒకరితో ఒకరు ఇంగ్లీషులో మాట్లాడుకుంటున్నారని చెప్పాడు. తాను.. వారి కుటుంబాలు చిక్కుల్లో పడకూడదని ఫిర్యాదు చేయలేదని బాధితుడు వెల్లడించాడు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు. దైనిక్ సవేరా నిర్వహించిన ఇంటర్వ్యూలో బాధితుడు ఈ మొత్తం సమాచారాన్ని పేర్కొన్నాడు. అలాగే ఈ ఘటన నాలుగు రోజుల క్రితం జరిగింది.

Next Story