బాలికను చంపి, ఆమె కాలేయాన్ని తిన్న నలుగురు.. కోర్టు సంచలన తీర్పు
ఏడేళ్ల బాలికను హత్య చేసి కాలేయం, ఇతర ముఖ్యమైన అవయవాలను తిన్న కేసులో దంపతులతో సహా నలుగురు వ్యక్తులకు జీవిత ఖైదు విధించబడింది.
By అంజి Published on 18 Dec 2023 4:30 AM GMTNext Story
బాలికను చంపి, ఆమె కాలేయాన్ని తిన్న నలుగురు.. కోర్టు సంచలన తీర్పు
ఏడేళ్ల బాలికను హత్య చేసి కాలేయం, ఇతర ముఖ్యమైన అవయవాలను తిన్న కేసులో దంపతులతో సహా నలుగురు వ్యక్తులకు జీవిత ఖైదు విధించబడింది. నవంబర్ 14, 2020 కాన్పూర్‌లోని ఘతంపూర్‌లో ఒక క్షుద్ర పూజారి సూచన మేరకు నిందితులు ఈ దారుణానికి ఓడిగట్టారు. మూడు సంవత్సరాల పాటు సాగిన విచారణ తర్వాత, అదనపు జిల్లా న్యాయమూర్తి (పోక్సో చట్టం) బాకర్ షమీమ్ రిజ్వీ, నిందితులైన దంపతులు పరశురామ్, సునైనా, వారి మేనల్లుడు అన్‌కుల్, అతని సహచరుడు వీరేన్‌లకు జీవిత ఖైదు విధించారు. అన్‌కుల్, వీరేన్‌లకు రూ.45 వేలు, పరశురామ్, సునైనాలకు రూ.20 వేలు జరిమానా విధించింది కోర్టు.
అదనపు జిల్లా ప్రభుత్వ న్యాయవాదులు రామ్ రక్షిత్ శర్మ, ప్రదీప్ పాండే, అజయ్ కుమార్ త్రిపాఠి మాట్లాడుతూ.. ఘతంపూర్‌లోని ఒక గ్రామానికి చెందిన తన ఏడేళ్ల కుమార్తె నవంబర్ 14, 2020 న తన ఇంటి బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మరుసటి రోజు, గ్రామం వెలుపల ఉన్న పొలంలో ఆమె మృతదేహం కనుగొనబడింది. పోలీసులు పరశురామ్, సునైనా, అంకుల్, వీరేన్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లయి 19 ఏళ్లు గడిచినా పరశురాం, సునైనా దంపతులకు సంతానం లేదని, ఓ బాలిక కాలేయం తినమని కోరిన ఓ క్షుద్ర పూజారిని సంప్రదించారని పోలీసులకు తెలిసింది.
అంకుల్, వీరేన్‌లు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి హత్య చేశారు. బాలిక కాలేయాన్ని తీసి పరశురాం, సునైనాలకు ఇచ్చారు. కోర్టు శనివారం శిక్షను ప్రకటించింది.