ఘోరం.. భక్తులపై నుంచి దూసుకెళ్లిన కారు.. నలుగురు దుర్మరణం
4 Dead After Speeding Car Rams Devotees.పండగ పూట విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో రైతులపైకి కారు దూసుకెళ్లిన
By తోట వంశీ కుమార్ Published on 16 Oct 2021 11:27 AM ISTపండగ పూట విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటన మరువకముందే తాజాగా చత్తీస్‌గడ్‌లో అలాంటి ఘటననే చోటు చేసుకుంది. నవరాత్రుల ముగింపు సందర్భంగా దుర్గమ్మ విగ్రహ నిమజ్జనాకి వెలుతున్న భక్తుల పై నుంచి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. 16 మంది గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. జాస్పూరు జిల్లా పాతల్‌గావ్ ప్రాంతంలో నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజించారు. దసరా రోజున ఊరేగింపుగా అమ్మవారి విగ్రహా నిమజ్జనానికి తీసుకువెలుతున్నారు. ఆ సమయంలో వేగంగా దూసుకువచ్చిన కారు భక్తులపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా మరో ముగ్గురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇంకో 16 మంది గాయపడగా.. వారికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని బబ్లూ విశ్వకర్మ (21), శిశుపాల్ సాహు (26) అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అలాగే కారు నుంచి పెద్ద ఎత్తున గంజాయిన స్వాధీనం చేసుకున్నారు.
घायलों के शीघ्र स्वास्थ्य लाभ की प्रार्थना करता हूँ.
— Bhupesh Baghel (@bhupeshbaghel) October 15, 2021
ఈ ఘటనపై చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ స్పందించారు. ఇది విషాదకర ఘటన అని.. నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. మృతుల కుటుంబాలకు రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు అయ్యే వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.