పండ‌గ పూట విషాదం.. చెరువులో ప‌డి న‌లుగురు చిన్నారులు మృతి

4 Children fell into a pond and died in Krishna District.పండ‌గ పూట విషాదం చోటు చేసుకుంది. ఆట స‌ర‌దా న‌లుగురు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Oct 2021 1:30 PM GMT
పండ‌గ పూట విషాదం.. చెరువులో ప‌డి న‌లుగురు చిన్నారులు మృతి

పండ‌గ పూట విషాదం చోటు చేసుకుంది. ఆట స‌ర‌దా న‌లుగురు చిన్నారుల ప్రాణాల‌ను బ‌లిగొంది. ఆడుకుంటూ ప్ర‌మాద‌వ‌శాత్తు చెరువులో ప‌డి న‌లుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న కృష్ణా జిల్లా కైక‌లూరు మండ‌లంలో చోటు చేసుకుంది. వ‌రాహ‌ప‌ట్నానికి చెందిన న‌లుగురు చిన్నారులు గురువారం ఆడుకుంటూ ఆడుకుంటూ చెరువులో ప‌డి పోయారు. చిన్నారుల‌కు ఈత రాక‌పోవ‌డంతో నీటిలో మునిగిపోయారు.

ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన స్థానికులు ప‌రుగున వ‌చ్చి చెరువులోకి దూకి న‌లుగురు చిన్నారుల‌ను పైకి తీసుకువ‌చ్చి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే చిన్నారులంతా మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన వారిలో ముగ్గురు బాలిక‌లు కాగా ఓ బాలుడు ఉన్నాడు. వీరంతా ప‌ది సంవ‌త్స‌రాల లోపు వ‌య‌స్సు వారే కావ‌డం గ‌మ‌నార్హం. ఒకేసారి న‌లుగురు చిన్నారులు మృతి చెంద‌డంతో గ్రామంలో విషాద‌చాయ‌లు అలుముకున్నాయి.

Next Story
Share it