హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. గుడిసెలకు మంటలు అంటుకోవడంతో నలుగురు చిన్నారులు సజీవ దహనం అయ్యారు.
ఉనా జిల్లాలోని అంబ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బనే డి హట్టిలోని మురికివాడలో బుధవారం రాత్రి మంటలు చెలరేగాయి. తొలుగ ఓ గుడిసెలలో మంటలు చెలరేగగా గుడిసె మొత్తం వ్యాపించాయి. పక్కనే ఉన్న మరో గుడిసెకు మంటలు క్షణాల్లోనే అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే రెండు గుడిసెలు దగ్థం అయ్యాయి. నలుగురు చిన్నారులు సజీవ దహనం అయ్యారు.
మృతులను శివమ్ కుమార్(6), గోలు కుమార్(7), నీతు(14) ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా.. పక్క గుడిసెలో ఉన్న సోను కుమార్ లు మరణించారు. ఘటనాస్థలానికి చేరుకున్న స్థానిక పోలీసు అధికారి పఠానియా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.