అందంగా లేవంటూ భర్త వెక్కిరింపులు.. భరించలేక భార్య ఆత్మహత్య

32-year-old woman ends life over husband’s taunts on looks

By అంజి
Published on : 23 Feb 2022 2:37 PM IST

అందంగా లేవంటూ భర్త వెక్కిరింపులు.. భరించలేక భార్య ఆత్మహత్య

కర్ణాటక రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. 32 ఏళ్ల మహిళను తన భర్త తరచూ వెక్కిరించడంతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకుంది. అందంగా లేవంటూ కట్టుకున్న భర్తే దారుణంగా అవహేళనలు చేయడంతో భరించలేపోయిన భార్య తన జీవితాన్ని ముగించుకుంది. రిపోర్ట్‌ ప్రకారం.. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం డీజే హల్లి ప్రాంతంలో జరిగింది. మృతురాలు తన భర్త నిజాముద్దీన్‌తో కలిసి నివసించేది. సోమవారం నాడు కూడా భర్త ఎప్పటిలాగానే భార్యను దూషించాడు.

దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అనిషా ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలను గమనించిన ఇరుగుపొరుగు వారు మంటలను ఆర్పారు. ఆ వెంటనే బాధితురాలిని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. ఆమె మంగళవారం మృతి చెందింది. అనిషా తల్లిదండ్రులు.. నిజాముద్దీన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అనిషా తల్లిదండ్రులు డీజే హళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు నిజాముద్దీన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Next Story