ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారం.. కుటుంబ సభ్యుల ముందే

హర్యానాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు మహిళలపై నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు వారి కుటుంబ సభ్యుల ముందే అత్యాచారానికి పాల్పడ్డారు.

By అంజి  Published on  22 Sept 2023 1:15 PM IST
Crime news, Haryana, Panipat

ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారం.. కుటుంబ సభ్యుల ముందే

హర్యానాలోని పానిపట్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు మహిళలపై నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు వారి కుటుంబ సభ్యుల ముందే అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం అర్థరాత్రి జరిగిందని పోలీసులు గురువారం తెలిపారు. నిందితులు కత్తులు, ఇతర పదునైన ఆయుధాలతో ఉన్నారని పోలీసులు తెలిపారు. నలుగురు వ్యక్తులు కుటుంబాలు నివసించే ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి ముందు ముగ్గురు మహిళా కూలీల కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టివేసారు. నిందితులు నగదు, నగలు కూడా దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సామూహిక అత్యాచారం జరిగిన ప్రదేశానికి ఒక కిమీ దూరంలో బుధవారం అర్థరాత్రి మరో దారుణ ఘటన జరిగింది.

అనారోగ్యంతో ఉన్న మహిళపై దాడి జరిగింది. దాడి ఆమె మరణానికి దారితీసింది. దుండుగులు ఆమె భర్త నుండి డబ్బులు దోచుకున్నారని పోలీసులు తెలిపారు. దుండగులు దంపతుల ఇంట్లోకి బలవంతంగా చొరబడి భౌతికంగా దాడి చేయడంతో రెండో ఘటనలోనూ అదే వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి నుంచి కొంత నగదు, మొబైల్‌ ఫోన్‌ను కూడా దోచుకెళ్లారు. ఈ రెండు సంఘటనలు ఒకే గ్రామంలో జరిగాయని పానిపట్‌లోని మట్లాడా పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ విజయ్ తెలిపారు. "దర్యాప్తు జరుగుతోంది... ఇప్పటివరకు ఎటువంటి అరెస్టులు చేయలేదు" అని అతను చెప్పాడు.

Next Story