వాష్‌రూమ్‌లో విద్యార్థిని డ్రెస్‌ మార్చుకుంటుండగా.. సీక్రెట్‌గా వీడియో తీసి..

3 Students Record Obscene Video of Girl at Institute’s Bathroom in Bhopal. మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. భోపాల్‌ నగరంలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లోని బాత్రూమ్‌లో 19 ఏళ్ల యువతి దుస్తులు

By అంజి  Published on  25 Sept 2022 3:00 PM IST
వాష్‌రూమ్‌లో విద్యార్థిని డ్రెస్‌ మార్చుకుంటుండగా.. సీక్రెట్‌గా వీడియో తీసి..

మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. భోపాల్‌ నగరంలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లోని బాత్రూమ్‌లో 19 ఏళ్ల యువతి దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాన్ని ముగ్గురు విద్యార్థులు వీడియో చిత్రీకరించి, ఆ క్లిప్‌ను సర్క్యులేట్ చేస్తానని బెదిరించి ఆమె నుంచి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామని, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులు, బాధితురాలు నగరంలోని గోవింద్‌పురా ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ)లో చదువుతున్నారు. సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన విద్యార్థిని ఇన్‌స్టిట్యూట్‌లోని బాత్‌రూమ్‌లో బట్టలు మార్చుకుంటున్న సమయంలో ముగ్గురు కలిసి వీడియో తీశారని అధికారి తెలిపారు.

''నిందితుడు బాధితురాలి స్నేహితులలో ఒకరికి వీడియోను చూపించి, రూ. 7,000 డిమాండ్ చేశాడు. ఒక వేళ డబ్బులు ఇవ్వకుంటే.. క్లిప్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తారని బెదిరించారు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు భయాందోళనకు గురై ఇంటి నుంచి వెళ్లిపోయింది'' అని పిప్లానీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అజయ్ నాయర్ తెలిపారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి బాలిక అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. పోలీసులు చేపట్టిన గాలింపు చర్యల్లో.. బాధితురాలిని గుర్తించారు. ఆ తర్వాత ఈ కేసును ఇన్‌స్టిట్యూట్‌ పరిధిలోని అశోక్ గార్డెన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు నాయర్ తెలిపారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ముగ్గురు విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు అశోకా గార్డెన్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అలోక్ శ్రీవాస్తవ తెలిపారు. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరో ఇద్దరు విద్యార్థుల కోసం గాలిస్తున్నామని, నిందితులు, బాధితురాలు ఒకే ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్నట్లు తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ జరుగుతోందని శ్రీవాస్తవ తెలిపారు.

Next Story