రైలు ఢీకొని ముగ్గురు కార్మికులు మృతి.. ట్రాక్‌లకు గ్రీజు వేస్తుండగా ప్రమాదం

3 railway workers dies in train accident in peddapalli. పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలపై పనులు చేస్తుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొని ముగ్గురు

By అంజి  Published on  21 Sept 2022 2:01 PM IST
రైలు ఢీకొని ముగ్గురు కార్మికులు మృతి..  ట్రాక్‌లకు గ్రీజు వేస్తుండగా ప్రమాదం

పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలపై పనులు చేస్తుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొని ముగ్గురు రైల్వే కార్మికులు మృతి చెందారు. హృదయ విదారకమైన ఈ సంఘటన పెద్దపల్లి మండలం కొత్తపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. మృతులు దుర్గయ్య (రైల్వే కార్మికుడు), ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు పెగడ రమేష్, వేణులు ట్రాక్‌లకు గ్రీజు వేస్తుండగా బెంగళూరు నుండి ఢిల్లీ వైపు వేగంగా వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించారు.

ఈ ప్రమాదం నుంచి మరొకరు తృటిలో తప్పించుకున్నారు. హుస్సేన్‌మియా వాగు వ‌ద్ద ట్రాక్ మ‌ర‌మ్మ‌తులు చేస్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు రైల్వే పోలీసులు నిర్ధారించారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని, ఘటన జరిగినప్పుడు కార్యాలయంలో లేని జేఈపై చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story