సైదాబాద్‌లో దారుణం.. ఐదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు లైంగిక దాడి

3 minors sexually assault 5-year-old girl at Saidabad. హైదరాబాద్: సైదాబాద్‌లో ఐదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

By అంజి  Published on  21 Dec 2022 12:02 PM IST
సైదాబాద్‌లో దారుణం.. ఐదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు లైంగిక దాడి

హైదరాబాద్: సైదాబాద్‌లో ఐదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. సైదాబాద్‌లో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న బాలిక బయట ఆడుతుండగా 16 ఏళ్లు, 11 ఏళ్లు, 9 ఏళ్ల వయసున్న ముగ్గురు మైనర్లు ఒంటరిగా ఉన్న ఆమెను గమనించారు. "ఆడుకుందాం అనే నెపంతో బాలికను ఆ ముగ్గురు ఇంటి డాబాపైకి తీసుకెళ్లారు" అని సైదాబాద్ పోలీసులు తెలిపారు. ఆ తర్వాత బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. టెర్రస్‌పై ఏడుస్తున్న బాలికను చూసిన స్థానికులు ఆమె పరిస్థితి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. వారు దర్యాప్తు ప్రారంభించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సైదాబాద్‌లో ఉంటున్న దంపతులకు ఆరు, ఐదు ఏళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లున్నారు. తల్లి దండ్రులు ప్రతి రోజూ పని కోసం బయటకు వెళ్తారు. ఉదయం ఇంటి నుంచి వెళ్తే సాయంత్రం ఆరింటికి వస్తారు. ఇక వారి పిల్లలు రోజు అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి మధ్యాహ్నం రెండింటికి ఇంటికి వస్తారు. కొద్దిసేపు ఇంట్లో ఉండి.. ఆ తర్వాత టీవీ చూసేందుకు సమీపంలోని ఓ ఇంటికి వెళ్తారు. అయితే గత మూడ్రోజుల నుంచి పెద్ద అమ్మాయి జ్వరంతో ఇంటి దగ్గరే ఉంటోంది. చిన్నమ్మాయి మాత్రమే అంగన్‌వాడీకి వెళ్లి వస్తోంది. ఆది, సోమ వారాల్లో సమీపంలోని ఇంట్లో టీవీ చూసేందుకు ఐదేళ్ల బాలిక బయటకు రాగా.. ముగ్గురు మైనర్లు ఆమెను ఆడుకుందాం అని చెప్పి ఓ భవనం మీదకు తీసుకెళ్లారు.

ఆ భవనం మీదే బాలికపై ముగ్గురూ లైంగికదాడికి పాల్పడ్డారు. సోమవారం సాయంత్రం ఇంటికొచ్చిన తల్లిదండ్రులకు చిన్న పాప కనిపించలేదు. టీవీ చూసేందుకు పొరుగింట్లో ఉందేమోనని భావించిన తల్లి అక్కడికి వెళ్లగా పాప రోదిస్తూ కనిపించింది. ఏమైందని అడుగగా.. జరిగిన విషయం చెప్పింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. బాలిక నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్న పోలీసులు, ముగ్గురు బాలురపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జువెనైల్‌ హోంకు తరలించారు.

Next Story