హైదరాబాద్: జనవరి 28, మంగళవారం తెల్లవారుజామున రాజేంద్రనగర్ సమీపంలోని ఆరామ్‌ఘర్ ఫ్లైఓవర్‌పై జరిగిన మోటార్‌సైకిల్ ప్రమాదంలో ముగ్గురు మైనర్ బాలురు విషాదకరంగా ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు ర్యాష్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నివేదికల ప్రకారం.. ముగ్గురూ బహదూర్‌పురా నుండి ఆరామ్‌ఘర్ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
మోటార్‌సైకిల్ డ్రైవర్ నియంత్రణ తప్పి ఫ్లైఓవర్ మీడియన్‌ను ఢీకొట్టాడు. దీని ప్రభావంతో ముగ్గురు అబ్బాయిలకు తీవ్ర గాయాలయ్యాయి. వారు సంఘటనా స్థలంలో మరణించారు. ప్రమాదాన్ని గమనించిన ఇతర వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషాద ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెట్టంతా ఎదిగిన కొడుకులను కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.