రాత్రి యువతికి నిప్పంటించే ప్రయత్నం.. ముగ్గురు అరెస్ట్‌

పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని బొంగావ్‌లో యువతికి నిప్పంటించడానికి ప్రయత్నించినందుకు ముగ్గురు వ్యక్తులను అరెస్టు

By అంజి  Published on  11 April 2023 12:30 PM IST
West Bengal, Crime news

రాత్రి యువతికి నిప్పంటించే ప్రయత్నం.. ముగ్గురు అరెస్ట్‌

పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని బొంగావ్‌లో యువతికి నిప్పంటించడానికి ప్రయత్నించినందుకు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి బొంగావ్‌లోని రాంక్రింషా పల్లికి చెందిన బాధితురాలు స్కూటీపై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉజ్జల్ దాస్, రాజీవ్ ఘోష్, రాజేష్ ఘోష్ అనే ముగ్గురు నిందితులు యువతిపై దాడి చేసి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించి కిరోసిన్ పోసి నిప్పంటించారు. అదృష్టవశాత్తూ, బాధితురాలు తప్పించుకోగలిగింది. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడానికి స్థానిక పోలీసు స్టేషన్‌కు పరిగెత్తింది.

గతంలో ప్రైవేట్ ట్యూషన్ కోసం వెళ్లిన ఇంట్లో ఒకరి నుంచి తనకు ఎదురైన వేధింపులను బాధితురాలు తన కుటుంబ సభ్యులకు తెలిపింది. ఆదివారం సాయంత్రం, ముగ్గురు నిందితులు ఆమె మార్గాన్ని అడ్డుకుని నిప్పంటించే ప్రయత్నం చేశారు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, సోమవారం బంగావ్ సబ్ డివిజనల్ కోర్టుకు తరలించారు. ఘటన తర్వాత భయాందోళనకు గురైన బాధితురాలు నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది.

Next Story