బైకును ఢీకొట్టిన టిప్ప‌ర్‌.. ముగ్గురు విద్యార్థులు మృతి

3 Dead In Nalgonda Accident. నల్గొండ జిల్లాలో టిప్పర్ బైకును ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.

By Medi Samrat  Published on  2 April 2021 3:03 PM IST
accident in Nalgonda

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభ‌వించింది. వివ‌రాళ్లోకెళితే.. జిల్లా కేంద్రంలో అనుముల మండలం చింతగూడెం స్టేజి సమీపంలో టిప్పర్ బైకును ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన‌ ముగ్గురు విద్యార్థులు బైక్ పై నల్గొండ కాలేజ్ కి వెళ్తుండగా ఈ ఘటన జ‌రిగింది.

మృతులది అనుముల మండలం కేంద్రంలోని చింతపల్లి, కొత్తల పురం. మృతుల‌ను శ్రీకాంత్(20), శివ(18), మహేష్ (17) గా గుర్తించారు. యువ‌కుల మృతితో వారి గ్రామాల్లో విషాదం చోటుచేసుకుంది. ఘ‌ట‌న‌పై స‌మాచారం అందిన వెంట‌నే ప్ర‌మాద స్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదంపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.


Next Story