అర్థరాత్రి వచ్చి ఆహారం అడిగాడు.. ఇవ్వలేదని ప్రియురాలిని దుపట్టాతో కట్టేసి..

21-year-old girl assaulted by boyfriend after fight over food. గుజరాత్‌ రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. నరోడా ప్రాంతంలో నివసిస్తున్న ఒక నివాసి సోమవారం తన ప్రియురాలిపై దాడి చేశాడు.

By అంజి  Published on  3 March 2022 6:18 AM GMT
అర్థరాత్రి వచ్చి ఆహారం అడిగాడు.. ఇవ్వలేదని ప్రియురాలిని దుపట్టాతో కట్టేసి..

గుజరాత్‌ రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. నరోడా ప్రాంతంలో నివసిస్తున్న ఒక నివాసి సోమవారం తన ప్రియురాలిపై దాడి చేశాడు. ఆహారం విషయంలో జరిగిన గొడవ తీవ్ర రూపం దాల్చడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి ప్రియురాలిని ఆహారం అడిగితే ఇవ్వకపోవడంతో ఆ వ్యక్తి దాడి చేశాడు. ఓ జాతీయ దినపత్రిక నివేదిక ప్రకారం.. తేజల్ ఠాకోర్ అనే బాధితురాలు మాట్లాడుతూ.. "మాకు పెళ్లి కాకపోయినా నేను నా ప్రియుడితో కలిసి జీవిస్తున్నాను. అజయ్ అర్ధరాత్రి ఇంటికి వచ్చి ఆహారం అడిగాడు. నేను ఆహారం ఇవ్వలేనని చెప్పాను. దీంతో అతడు నాపై కోపం పెంచుకున్నాడు" అని తెలిపింది.

తన ప్రియుడు అజయ్ ఠాకూర్‌పై బాధితురాలు మంగళవారం నరోడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు ఆమెను దుపట్టాతో కట్టేసి కొట్టాడు. టేబుల్ ఫ్యాన్‌తో కూడా కొట్టాడని ఆమె పేర్కొంది. "పోలీసులను ఆశ్రయిస్తే చంపేస్తానని బెదిరించి అజయ్ ఇంటి నుండి వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోయిన తర్వాత, నేను మా తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి సివిల్ ఆసుపత్రిలో చేరాను" అని ఆమె వెల్లడించింది. ఐపీసీ సెక్షన్ 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 294(బి) (ఏదైనా బహిరంగ ప్రదేశంలో లేదా సమీపంలో ఏదైనా అసభ్యకరమైన పదాలు మాట్లాడటం), 506(2) (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేయబడింది. నిందితుడిని పోలీసులు ఇంకా పట్టుకోలేదు.

Next Story
Share it