సూర్యాపేట జిల్లాలో దారుణం.. యువ‌తికి మ‌త్తుమందిచ్చి.. మూడురోజుల పాటు

20 Year old woman molested after dragging in Kodad.ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికీ మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 April 2022 4:20 AM GMT
సూర్యాపేట జిల్లాలో దారుణం.. యువ‌తికి మ‌త్తుమందిచ్చి.. మూడురోజుల పాటు

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికీ మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. నిత్యం ఏదో ఒక చోట వారిపై దాడుల‌కు పాల్ప‌డుతూనే ఉన్నారు. ఓ యువ‌తికి కూల్‌డ్రింక్‌లో మ‌త్తు మందు కలిపి ఇచ్చి మూడు రోజుల పాటు ఇద్ద‌రు యువ‌కులు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ దారుణ ఘ‌ట‌న సూర్యాపేట జిల్లా కోదాడ‌లో వెలుగు చూసింది. నిందితుల్లో మున్సిపాలిటీ కౌన్సిల‌ర్ కుమారుడు ఉండ‌డంతో ఈ విష‌యం స్థానికంగా క‌ల‌క‌లం సృష్టించింది.

వివ‌రాల్లోకి వెళితే.. కోదాడ పట్టణంలోని మాతానగర్‌లో ఓ యువ‌తి(20) త‌ల్లితో క‌లిసి నివాసం ఉంటోంది. బాధితురాలు శుక్ర‌వారం సాయంత్రం ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదే ప్రాంతానికి చెందిన గౌస్ పాషా, అత‌డి స్నేహితుడు సాయిరామ్ రెడ్డి ఆ యువ‌తిని బ‌ల‌వంతంగా ఆటో ఎక్కించుకుని ప‌ట్ట‌ణ శివారులోని ఓ ఇంటికి తీసుకెళ్లి బంధించారు. అక్క‌డ కూల్ డ్రింక్‌లో మ‌త్తు మందు క‌లిపి బ‌ల‌వంతంగా తాగించారు.

స్మృహ కోల్పోయిన యువ‌తిపై ఇద్ద‌రూ అత్యాచారానికి ఒడిగ‌ట్టారు. మూడు రోజుల పాటు చిత్ర హింస‌ల‌కు గురి చేయ‌డంతో పాటు ప‌లు మార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. బాధితురాలి అరుపులు విన్న చుట్టుప‌క్క‌ల వాళ్లు యువ‌తి కుటుంబీల‌కు స‌మాచారం అందించారు. బాలిక త‌ల్లి బంధువుల‌తో వెళ్లి కుమారైను ర‌క్షించింది. అనంత‌రం పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు..గాయాలతో ఉ న్న యువతిని వైద్య పరీక్షల నిమిత్తం సూర్యా పేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

బాధితురాలి త‌ల్లి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించామ‌ని, నిందితుల‌ను విచారిస్తున్నామ‌ని ప‌ట్ట‌ణ సీఐ న‌ర‌సింహ‌రావు చెప్పారు. పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌న్నారు.కాగా.. నిందితుల్లో ఒక‌రు మున్సిపాలిటీ ప‌రిధిలోని ఓ వార్డు కౌన్సిల‌ర్ కుమారుడు అని, దీంతో వారు త‌మ‌ను బెదిరిస్తున్నార‌ని బాధితురాలి త‌ల్లి మీడియాకు తెలిపింది.

Next Story