మణుగూరులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

2 killed as two bikes collide in Manuguru. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం సమితి సింగారం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

By అంజి
Published on : 25 Feb 2022 1:51 PM IST

మణుగూరులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం సమితి సింగారం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి రెండు బైక్‌లు ఎదురుదెరుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. బైక్‌లు నడుపుతున్న యువకులు రోడ్డుపై పడి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. బాటసారులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.

మరో రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా కంది వద్ద జాతీయ రహదారి-65పై వేగంగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. చెర్లగూడెం గ్రామంలో నిర్మాణ స్థలంలో తాపీ మేస్త్రీలుగా పనిచేస్తున్న బాధితులు తిరిగి సంగారెడ్డికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులు సంగారెడ్డికి చెందిన బీరప్ప, ఆంజనేయులు, ఇజ్రాయెల్‌లు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story