రోడ్డుపై బీఎండబ్ల్యూ బీభత్సం.. ఇద్దరు యువతులు దుర్మరణం

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు స్కూటర్‌ను ఢీకొనడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు.

By అంజి  Published on  16 Sept 2024 7:50 AM IST
Indore women killed , BMW, scooter, Crime

రోడ్డుపై బీఎండబ్ల్యూ బీభత్సం.. ఇద్దరు యువతులు దుర్మరణం

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు స్కూటర్‌ను ఢీకొనడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. బీఎండబ్ల్యూ డ్రైవర్‌ను అరెస్టు చేయగా, ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. శనివారం నగరంలోని మహాలక్ష్మి నగర్ ప్రాంతంలో బాధితులైన దీక్షా జాదూన్ (25), లక్ష్మీ తోమర్ (24) తమ స్కూటర్‌పై ప్రయాణిస్తుండగా, తప్పుడు మార్గంలో వస్తున్న బీఎండబ్ల్యూ వారి స్కూటర్‌ను ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వారు మరణించారు.

ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ గజేంద్ర ప్రతాప్ సింగ్ (28) అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రాథమిక విచారణ ప్రకారం.. నిందితుడు తన స్నేహితుడి పుట్టినరోజును జరుపుకోవడానికి ఆతురుతలో ఉన్నాడు. కేక్‌తో అక్కడికి వెళ్తున్నాడు, దాని కారణంగా అతను కారును తప్పు దిశలో నడిపాడు. విచారణలో నిందితుడు సంఘటన సమయంలో తాను నడుపుతున్న బిఎమ్‌డబ్ల్యూ సెకండ్ హ్యాండ్ కారు అని, దానిని కొంతకాలం క్రితం కొన్నానని చెప్పాడు.

ప్రఖజ్రానా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) మనోజ్ సెంధవ్ నిందితుడిని పట్టుకోవడానికి పోలీసు బృందాన్ని పంపించారు. దీంతో పోలీసులు బీఎండబ్ల్యూ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బాధితులు ఇండోర్‌లోని తులసినగర్ ప్రాంతానికి చెందినవారు. భారతీయ న్యాయ్ సంహిత (BNS) సెక్షన్ 105 (అపరాధపూరితమైన నరహత్య హత్య కాదు) కింద డ్రైవర్‌పై కేసు నమోదు చేయబడింది.

Next Story