హైదరాబాద్: మేడ్చల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఒక యువతి మేడ్చల్ పోలీసులను ఆశ్రయించింది. 19 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగి అయిన ఫిర్యాదుదారురాలు, రైల్వే ట్రాక్ దగ్గర నుండి తన ఇంటి వైపు నడుచుకుంటూ వెళుతుండగా ఈ సంఘటన జరిగిందని, వెనుక నుండి వచ్చిన నిందితుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగికంగా వేధించాడని చెప్పింది.
ఆమె నిందితుడిని చెంపదెబ్బ కొట్టి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అతన్ని గమనించారు. దీంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. యువతి ఫిర్యాదు ఆధారంగా, మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతిని వేధించిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అటు ఫిర్యాదులోని వాస్తవాలను ధృవీకరిస్తున్నారు. తదుపరి చర్య కోసం కేసును ప్రభుత్వ రైల్వే పోలీసులకు బదిలీ చేస్తారు.