దారుణం.. క‌దులుతున్న కారులో మోడ‌ల్‌పై సామూహిక అత్యాచారం

19 Year Old model Molested inside a car in Kochi. 19 ఏళ్ల మోడ‌ల్‌పై కారులో ముగ్గురు యువ‌కులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Nov 2022 8:06 AM IST
దారుణం.. క‌దులుతున్న కారులో మోడ‌ల్‌పై సామూహిక అత్యాచారం

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికి మ‌హిళ‌ల‌పై దారుణాలు ఆగ‌డం లేదు. నిత్యం ఏదో ఒక చోట మ‌హిళ‌ల‌పై దాడులు జ‌రుగుతూనే ఉంది. 19 ఏళ్ల మోడ‌ల్‌పై కారులో ముగ్గురు యువ‌కులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ దారుణ ఘ‌ట‌న కేర‌ళ రాష్ట్రంలో జ‌రిగింది.

కొచ్చిన‌గ‌రంలోని క‌క్క‌నాడ్ ప్రాంతంలో 19 ఏళ్ల మోడ‌ల్ నివ‌సిస్తోంది. స్నేహితురాలైన రాజస్థాన్‌కు చెందిన యువతి ఆమెను గురువారం రాత్రి డీజే పార్టీకి ఆహ్వానించింది. మోడ‌ల్ పార్టీకి వెళ్ల‌గా.. ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న ముగ్గురు యువ‌కుల‌తో బాధితురాలికి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. పార్టీలో మోడ‌ల్ బాగా మ‌ద్యం సేవించింది. ఆమెను డ్రాప్ చేస్తామంటూ ఆ ముగ్గురు యువ‌కులు ఆమెను కారులో ఎక్కించుకున్నారు. సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

అనంత‌రం ఆమెను క‌క్క‌నాడ్ ప్రాంతంలో ఆమె ఇంటి వ‌ద్ద ప‌డేశారు. తీవ్రంగా గాయ‌ప‌డిన ఆమెను ఆమె రూమ్‌మేట్ కలమస్సేరిలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు త‌ర‌లించింది. ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్యాచార ఘ‌ట‌న‌పై పోలీసులు ఆరా తీశారు. ఈ కేసులో బాధితురాలి స్నేహితురాలితో పాటు అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేశారు.

Next Story