18 ఏళ్ల కుర్రాడు.. ఏడాది క్రితం ప్రేమ వివాహం.. మ‌రో యువ‌తితో ప్రేమాయ‌ణం.. చివ‌రికి..!

18 Years old man commits suicide in hyderabad.ఇంట్లో భార్య ఉన్నా కూడా మ‌రో యువ‌తి వెంట ప‌డ్డాడు ఆ 18 ఏళ్ల యువ‌కుడు. దీంతో ఆ యువ‌కుడు త‌న త‌నువును చాలించాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 April 2021 2:16 AM GMT
young boy suicide

ఓ అమ్మాయిని ప్రేమించాడు. పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నాడు. తండ్రి చేసే ప‌నుల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఇంట్లో భార్య ఉన్నా కూడా మ‌రో యువ‌తి వెంట ప‌డ్డాడు ఆ 18 ఏళ్ల యువ‌కుడు. పెళ్లైన విష‌యం దాచి ఆ యువ‌తితో ప్రేమ క‌లాపాలు సాగించాడు. విష‌యం ఇంట్లోని భార్య‌కు తెలిసింది. ఇంట్లో గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. ఇంట్లో గొడ‌వ‌లు ఓ వైపు.. మ‌రో వైపు పెళ్లి చేసుకోవాల‌ని ప్రియురాలి ఒత్తిడి మ‌రోవైపు. దీంతో ఆ యువ‌కుడు త‌న త‌నువును చాలించాడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

హైదరాబాద్ లోని రెయిన్ బజార్ కు చెందిన జమాల్పుర్ కరణ్ లాల్ అనే వ్య‌క్తి మాంసం విక్ర‌యిస్తూ జీవ‌నం కొన‌సాగిస్తున్నాడు. అత‌డి కొడుకు దీప‌క్ కుమార్‌(18) అల్ల‌రి చిల్ల‌ర‌గా తిరుగుతూ.. తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. గ‌తేడాది హ‌య‌త్‌న‌గ‌ర్‌కు చెంద‌ని ఓ యువ‌తిని ప్రేమించాడు. పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకుని హ‌య‌త్‌న‌గ‌ర్‌లోనే నివాసం ఉంటున్నాడు. వివాహం అయ్యాక కూడా అత‌డు అమ్మాయిల‌ వెంట ప‌డ‌డం మానుకోలేదు. మ‌రో యువ‌తితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డుపుతున్నాడు. ఈ విష‌యం భార్య‌కు తెలిసింది. అప్ప‌టి నుంచి ఇంట్లో గొడ‌వ‌లు ప్రారంభం అయ్యాయి.

ఇక అదే స‌మ‌యంలో ప్రేయ‌సి కూడా పెళ్లి చేసుకోవాలంటూ ఒత్త‌డి చేస్తోంది. వీరిద్ద‌రి ఒత్తిడి భ‌రించ‌లేక‌పోతున్నానంటూ ప‌లుమార్లు త‌న స్నేహితుల ద‌గ్గ‌ర చెప్పుకుని బాధ‌ప‌డేవాడు. ఇదే క్ర‌మంలో శ‌నివారం సాయంత్ర స్థానిక దోబీఘాట్ వ‌ద్ద‌కు వ‌చ్చాడు. తండ్రికి ఫోన్ చేశాడు. త‌న‌కు జీవితంపై విర‌క్తి క‌లిగింద‌ని.. ఎర్ర‌కుంట స‌మీపంలోని పాడుబ‌డిన బావిలో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్లు చెప్పాడు. వెంట‌నే ఆతండ్రి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చాడు. సైదాబాద్ పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. అయితే.. అప్ప‌టికే దీప‌క్ కుమార్ బావిలోకి దూసి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. మృత‌దేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


Next Story
Share it