17 ఏళ్ల అమ్మాయి.. పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరింది
అమ్మాయి తండ్రి మాట్లాడుతూ.. పెళ్లి చేసుకోవాలనే విషయాన్ని నా కుమార్తె సోదరుడితో పంచుకుంది.
By Medi Samrat Published on 14 Aug 2022 4:50 PM ISTచండీగఢ్: పెళ్లికి నిరాకరించడంతో 17 ఏళ్ల అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హర్యానాలోని అంబాలాలో చోటుచేసుకుంది. నిందితుడు పంజోఖ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్నాలా గ్రామానికి చెందినవాడు. చనిపోయిన బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 21 ఏళ్ల ప్రేమికుడిని పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయి తండ్రి టీ అమ్మేవాడు. ఓ యువకుడితో, అతని కూతురు ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంటానని యువకుడు మాట ఇచ్చాడని బాలిక తన సోదరుడికి కూడా చెప్పింది. అయితే కొద్దిరోజుల తర్వాత యువకుడి తీరులో మార్పు వచ్చింది. పెళ్లి చేసుకోవాలని అమ్మాయి కోరుతుండగా.. అందుకు ఆ యువకుడు నిరాకరించాడు. దీంతో అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది.
అమ్మాయి తండ్రి మాట్లాడుతూ.. పెళ్లి చేసుకోవాలనే విషయాన్ని నా కుమార్తె సోదరుడితో పంచుకుంది. అందుకు అతడు ఒప్పుకోలేదు. ఆమె మనసు మార్చడానికి ప్రయత్నించాడు. కానీ ఆ అమ్మాయి ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇటీవల తన ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని అడిగింది. అందుకు అతడు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఆగస్టు 8వ తేదీ రాత్రి విషం సేవించి ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు సమీపంలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత డాక్టర్ చికిత్స చేసి మరుసటి రోజు డిశ్చార్జి చేశారు. పూర్తిగా కోలుకోవడానికి ఇంట్లోనే కొన్ని మందులు ఇచ్చాడు. అయితే శుక్రవారం ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆమెను మళ్లీ ఆస్పత్రికి తరలించారు. ఈ సమయంలో మృతి చెందినట్లు డాక్టర్ చెప్పారని తెలిపారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 306 కింద నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పరవ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సూరజ్ కుమార్ తెలిపారు.
Next Story