సభ్య సమాజం తలదించుకునే ఘటన.. బాలికపై తండ్రి, తాత, మామ అత్యాచారం
17 Year old girl alleges Molested by her father and uncle in Pune.బాలికపై సొంత తండ్రి, తాత, అంకుల్ అత్యాచారానికి
By తోట వంశీ కుమార్
మహారాష్ట్రలో సభ్య సమాజం తలదించుకునే ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికను కంటికి రెప్పలా కాపాడాల్సిన వాళ్లే కీచకుల్లా మారిపోయారు. వావి వరుసలు మరిచి మృగాల్లా ప్రవర్తించారు. బాలికపై సొంత తండ్రి, తాత, అంకుల్ లు పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.
పుణెలో 17 ఏళ్ల బాలిక తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. బుధవారం బాలిక చదువుతున్న కాలేజీలో లైంగిక వేధింపులపై అవగాహాన కల్పించారు. ఈ క్రమంలో లైంగిక వేదింపులపై కమిటీ సభ్యుల ముందు బాలిక తన గోడును వినిపించింది. బాలిక చెప్పిన విషయాలను అక్కడి వారిని నివ్వెర పరిచాయి. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుణె పోలీసులు ఫోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలిక తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.
ఎఫ్ఐఆర్ ప్రకారం.. బాలిక కుటుంబం తొలుత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తమ స్వగ్రామంలో ఉండేవారు. 2016 నుంచి 2018 మధ్య కాలంలో బాలిక పై ఆమె మామ పలు మార్లు అత్యాచారం చేశాడు. తాతయ్య కూడా లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక రెండు సంవత్సరాల పాటు బాలిక ఈ నరకయాతన అనుభవించింది. 2018లో బాలిక కుటంబం పుణెకి వలస వచ్చింది.
ఆ సమయంలో బాలిక తనపై జరిగిన లైంగిక దాడి విషయాలను తన తండ్రికి చెప్పుకోలేక ఓ చీటీలో రాసి ఇచ్చింది. అది చదివిన తండ్రీ.. వారిపై చర్యలు తీసుకోకపోగా.. తల్లి లేని సమయంలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడేవాడని బాలిక ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం తండ్రిని అరెస్ట్ చేశారు. యూపీలోని గ్రామంలో ఉన్న మామయ్య. తాతలను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.