'లవ్‌ యూ అమ్మ'.. తల్లి తిట్టిందని 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య

గుజరాత్‌లోని వడోదరలో 16 ఏళ్ల బాలిక తన తల్లి తిట్టిన రెండు రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకుంది.

By అంజి
Published on : 7 April 2025 9:25 AM IST

16-year-old girl,  Vadodara, suicide, scolding, Crime

'లవ్‌ యూ అమ్మ'.. తల్లి తిట్టిందని 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య

గుజరాత్‌లోని వడోదరలో 16 ఏళ్ల బాలిక తన తల్లి తిట్టిన రెండు రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకుంది. 11వ తరగతి చదువుతున్న ఆ బాలిక తన తమ్ముడితో కలిసి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. రెండు రోజుల క్రితం.. తన కూతురు తన ఫ్రెండ్‌కి క్రమం తప్పకుండా లిఫ్ట్ ఇవ్వడంపై తల్లి అభ్యంతరం చెప్పింది. ఆ ఫ్రెండ్ తన కూతురిపై ఆధారపడకుండా తన సొంత వాహనాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారని ఆ తల్లి ప్రశ్నించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన జరిగినప్పుడు బాలిక తల్లి అయిన వితంతువు, సమీపంలోని ఇళ్లకు పనికి వెళ్లింది. తిరిగి వచ్చేసరికి, తన కుమార్తె ఉరివేసుకుని ఉండటం చూసి, వెంటనే అధికారులకు సమాచారం అందించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. సంఘటనా స్థలం నుంచి ఆమె తల్లి పేరు మీద రాసిన సూసైడ్ నోట్ లభించిందని పోలీసు అధికారులు తెలిపారు.

మృతురాలు తన తల్లికి ఒక లేఖ రాసి, "అమ్మా, మీ కూతురు మీ నియంత్రణలో లేదు. అందరూ సంతోషంగా ఉండాలి. నేను వెళ్తున్నాను" అని రాసింది. ఆ నోట్‌లో, ఆ అమ్మాయి తన తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోవాలని తన తల్లిని కోరింది. "లవ్ యు మా" అని రాసింది. రెండు రోజుల క్రితం తన కూతురు తన స్నేహితుడితో తరచుగా బయటకు వెళ్తోందని తిట్టానని తల్లి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story