హర్యానా రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. జింద్ జిల్లాలో 16 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనకు సంబంధించిన వీడియో రికార్డ్ చేసిన నిందితులు, బాలికను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేశారని పోలీసులు తెలిపారు. బాలికపై సామూహిక అత్యాచారం గర్హి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో గత సంవత్సరం ఆగస్టు 5 న జరిగింది. 11 తరగతి బాలిక తన పొరుగున అద్దెకు ఉంటున్న ఒక మహిళను కలవడానికి వెళ్ళినప్పుడు ఈ దారుణం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఇద్దరు నిందితులు ఆమె ఆహారంలో మత్తు మందు కలిపి, ఆమెపై అత్యాచారం చేసి సంఘటన యొక్క వీడియోను కూడా రికార్డ్ చేశారని, ప్రాణాలతో బయటపడిన బాలిక తన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని ఆమెను బెదిరించి వీడియో తీసి డబ్బులు వసూలు చేశారు. బలవంతపు డిమాండ్‌లతో విసిగిపోయిన బాలిక చివరకు కుటుంబ సభ్యులకు తన బాధను వివరించింది, ఆ తర్వాత వారు ఫిర్యాదుతో పోలీసులను ఆశ్రయించారు. మహిళతో సహా ముగ్గురు నిందితులపై లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, ఇతర సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.