మామ ఇంటికి వెళుతున్న 15 ఏళ్ల బాలిక.. లిఫ్ట్ ఇచ్చి గ్యాంగ్ రేప్‌కు పాల్ప‌డ్డారు

గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో 15 ఏళ్ల బాలికపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

By Kalasani Durgapraveen  Published on  9 Nov 2024 8:45 AM IST
మామ ఇంటికి వెళుతున్న 15 ఏళ్ల బాలిక.. లిఫ్ట్ ఇచ్చి గ్యాంగ్ రేప్‌కు పాల్ప‌డ్డారు

గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో 15 ఏళ్ల బాలికపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నవంబర్ 5న అంబాజీ పట్టణంలో ఈ ఘటన జరిగిందని ఇన్‌స్పెక్టర్ ఆర్‌బీ గోహిల్ తెలిపారు. నవంబర్ 6న అంబాజీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

అమ్మాయి సాయంత్రం సమయంలో తన మామ ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా, ఆమెకు తెలిసిన లాలా పర్మార్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై ఆమెకు లిఫ్ట్ ఇచ్చాడు. పర్మార్ ఆమెను చాప్రి రహదారి వెంబడి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు, అక్కడ అతను, ఐదుగురు సహచరులు ఆమెపై అత్యాచారం చేశారు. ఆమె అపస్మారక స్థితిలో ఉండగా అక్కడి నుండి పారిపోయారని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై కాంగ్రెస్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. గుజరాత్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని, ఇటీవల ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండి ప్రజలను రక్షించడానికి సమయాన్ని కేటాయించలేదన్నారు.

Next Story