పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యెండగండి గ్రామంలో ఓ మహిళకు మృతదేహం పార్శిల్ పంపిన ఘటనపై పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఆచూకీ కోసం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీమ్ అస్మీ 11 బృందాలను ఏర్పాటు చేశారు. 15 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, ప్రస్తుతం పోలీసులు వారిని విచారిస్తున్నారని సోర్సెస్ చెబుతున్నాయి. భీమవరం డీఎస్పీ ఆర్‌జీ జయసూర్య, ఆకివీడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జగదీశ్వరరావు, ఇతర అధికారులు విచారణను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
అక్టోబరు 20న యెండగండి గ్రామంలో ఓ మహిళ మృతదేహం ఉన్న పార్శిల్‌ను అందుకుంది. పార్శిల్ ఓపెన్ చూసి చూడగా.. అందులో గుర్తు తెలియని మృతదేహం రావడం కలకలం రేపింది. మహిళ తన ఇంటి నిర్మాణం కోసం క్షత్రియ సేవా సమితికి ఆర్థికసాయం కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. మొదటి విడత కింద ఇంటి నిర్మాణం కోసం సేవా సమితి టైల్స్ అందజేసింది. మరోసారి మహిళ కరెంట్ సామాగ్రి కోసం దరఖాస్తు చేసుకుంది. రెండోసారి పార్శిల్ లో కరెంట్ సామాగ్రి బదులు మృతదేహం వచ్చింది. దీంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకుని జిల్లా ఎస్పీ నయీం అస్మీ..మృతదేహాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.