రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన టెంపో.. 15 మంది అక్కడికక్కడే మృతి

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత్ మాల ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం రాత్రి ఆగి ఉన్న ట్రక్కును టెంపో..

By -  అంజి
Published on : 2 Nov 2025 9:10 PM IST

15 dead,  traveller rams parked truck, Jodhpur, Rajasthan

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన టెంపో.. 15 మంది అక్కడికక్కడే మృతి

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత్ మాల ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం రాత్రి ఆగి ఉన్న ట్రక్కును టెంపో ట్రావెలర్ ఢీకొన్న ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఫలోడి పోలీస్ సూపరింటెండెంట్ కుందన్ కన్వారియా ప్రకారం.. బాధితులు దాదాపు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలాయత్ ఆలయాన్ని సందర్శించి జోధ్‌పూర్‌కు తిరిగి వస్తున్నారు.

బాధితులందరూ జోధ్‌పూర్‌లోని ఫలోడి ప్రాంత నివాసితులు. గాయపడిన వారిని మొదట సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి, తరువాత అధునాతన చికిత్స కోసం గ్రీన్ కారిడార్ ద్వారా జోధ్‌పూర్‌కు తరలించారు. వేగంగా వస్తున్న టెంపో ట్రావెలర్ రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిందని, దీంతో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయిందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అచల్ సింగ్ దేవరా తెలిపారు. ఈ ప్రమాదం చాలా తీవ్రంగా ఉండటంతో అనేక మంది ప్రయాణికులు శిథిలాల లోపల చిక్కుకున్నారని ఆయన తెలిపారు.

స్థానిక నివాసితులు, ప్రయాణిస్తున్న వాహనదారులతో కలిసి పోలీసు బృందాలు మృతదేహాలను వెలికితీసి గాయపడిన వారికి సహాయం చేయడానికి సహాయక చర్యలు చేపట్టాయి. "బలంగా ఢీకొనడంతో మృతదేహాలు సీట్లలో ఇరుక్కుపోయాయి. వాటిని తొలగించడంలో మేము చాలా ఇబ్బంది పడ్డాము" అని ఫలోడి పోలీస్ స్టేషన్ అధికారి అమనారామ్ అన్నారు. జోధ్‌పూర్ పోలీస్ కమిషనర్ ఓం ప్రకాష్ మధురదాస్ మాథుర్, సూపరింటెండెంట్ వికాస్ రాజ్‌పురోహిత్ ఆసుపత్రిని సందర్శించి గాయపడిన వారికి చికిత్స ఏర్పాట్లను పరిశీలించారు.

బాధితులను గుర్తించి వారి కుటుంబాలకు సమాచారం అందించడానికి అధికారులు కృషి చేయడంతో రాత్రి పొద్దుపోయే వరకు సహాయ చర్యలు కొనసాగాయి. కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. "ఫలోడిలోని మటోడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది మరణించారని పాట్నాలో నాకు ఇప్పుడే వార్త అందింది. ఇది విని నేను చాలా బాధపడ్డాను. మరణించిన వారందరికీ ఆయన పాదాల చెంత స్థానం కల్పించాలని, వారి కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని ఆయన ట్వీట్ చేశారు.

Next Story