బాలిక ఫోటోతో ఇన్‌స్టాగ్రామ్‌లో బాలుడి స్టేట‌స్‌.. నువ్వు నా భార్య‌వి అవుతావా..?

14 Year old boy stalks molests girl on way to school. సోష‌ల్ మీడియాలో నువ్యు నాకు భార్య‌వి అవుతావా అని బాలిక ఫోటోను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Nov 2022 4:26 AM GMT
బాలిక ఫోటోతో ఇన్‌స్టాగ్రామ్‌లో బాలుడి స్టేట‌స్‌.. నువ్వు నా భార్య‌వి అవుతావా..?

ఆన్‌లైన్ క్లాసుల పుణ్య‌మా అని పిల్ల‌ల చేతుల్లోకి మొబైల్ ఫోన్లు వ‌చ్చాయి. చ‌దువు సంగ‌తి ఎలా ఉన్నా స‌రే కొంద‌రు మాత్రం ఫోన్ల‌తో కాల‌క్షేపం చేస్తూ చెడు మార్గాల్లో ప‌య‌నిస్తున్నారు. తెలిసీ తెలియ‌ని త‌నంతో వారు చేసే ప‌నుల వ‌ల్ల నేర‌స్తులుగా మారుతున్నారు. అందుకునే త‌ల్లిదండ్రులు ఎల్ల‌ప్పుడూ త‌మ‌ చిన్నారుల‌ను ఓ కంట క‌నిపెడుతూ ఉండాలి. సోష‌ల్ మీడియాలో "నువ్యు నాకు భార్య‌వి అవుతావా " అని బాలిక ఫోటో ను బాలుడు పోస్ట్ చేశాడు. దీంతో అత‌డిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లో జ‌రిగింది.

వివ‌రాలు ఇలా ఉన్నాయి. పూణేలోని హ‌డ‌ప్స‌ర్ ప్రాంతంలోని ఓ ప్ర‌ముఖ పాఠ‌శాల‌లో 14 ఏళ్ల బాలుడు చ‌దువుతున్నాడు. అదే పాఠ‌శాల‌లో చ‌దువుతున్న 13 ఏళ్ల బాలిక‌ను త‌న‌తో స్నేహం చేయాల‌ని వెంట‌ప‌డేవాడు. "నాతో స్నేహం చేయ‌కుంటే నిన్ను ఎత్తుకుపోతానంటూ" బెదిరించేవాడు. అయితే.. ఆ బాలిక అత‌డి బెదిరింపుల‌ను లెక్క‌చేయ‌లేదు.

దీంతో ఆ బాలిక‌పై బాలుడు కోపం పెంచుకున్నాడు. ఆ బాలిక ఫోటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టేట‌స్‌లో పెట్టి.. "నువ్వ నా భార్య‌వి అవుతావా..?" అని రాసుకొచ్చాడు. ఈ స్టేట‌స్ చూసిన బాలిక జ‌రిగిన విష‌యాన్ని మొత్తం త‌ల్లిదండ్రుల‌కు చెప్పింది. వారు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. బాలుడిపై పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Next Story
Share it