విషాదం.. బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ బస్సు.. 14 మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో మంగళవారం బస్సు వంతెనపై నుండి పడిపోవడంతో కనీసం 14 మంది మరణించారు.

By అంజి  Published on  9 May 2023 11:13 AM IST
Indore bus, Madhyapradesh, Khargone, bridge

విషాదం.. బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ బస్సు.. 14 మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో మంగళవారం బస్సు వంతెనపై నుండి పడిపోవడంతో కనీసం 14 మంది మరణించారు. దాదాపు 20 మంది గాయపడ్డారు. వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఇండోర్‌కు వెళ్తున్న బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి కింద పడిపోయింది. ఘటన తర్వాత ఆ ప్రాంతంలోని స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇంతలో ప్రమాద స్థలికి కలెక్టర్ శివరాజ్ సింగ్ వర్మ చేరుకున్నారు. ప్రమాదం తరువాత, మధ్యప్రదేశ్ ప్రభుత్వం మృతుల కుటుంబ సభ్యులకు 4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

తీవ్రంగా గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేలు, క్షతగాత్రులకు రూ.25 వేలు ప్రకటించింది. ఆదివారం ముంబైలోని పశ్చిమ శివారు అంధేరిలో బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) బస్సు ఒక దుకాణంపైకి దూసుకెళ్లింది. అంధేరి (తూర్పు)లోని మహంకాళి రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుందని రవాణా సంస్థ ప్రతినిధి తెలిపారు. బస్సు అంధేరి స్టేషన్ వైపు వెళుతుండగా, వాలుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయి, వాహనాన్ని దుకాణంలోకి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, దుకాణానికి కొంత నష్టం వాటిల్లిందని, డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.

Next Story