షాకింగ్.. బాలుడిపై మైనర్ల లైంగికదాడి
13 year old boy sexually assaulted by two juveniles in UP. 13ఏళ్ల బాలుడిపై ఇద్దరు మైనర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు.
By తోట వంశీ కుమార్ Published on 6 March 2021 1:11 PM IST
సమాజం ఎటు వైపు పోతుందో అర్థం కావడం లేదు. సెల్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాక అశ్లీల దృశ్యాలు చూడడం ఎక్కువైందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. వీటి ప్రభావమో ఏమో కానీ.. తెలిసీ తెలియని వయసులోనే తప్పటగులు వేస్తున్నారు. ఏం చేస్తున్నామో కూడా తెలియని స్థితిలో దారుణాలకు పాల్పడుతున్నారు. 13ఏళ్ల బాలుడిపై ఇద్దరు మైనర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ విషయం ఎవరికైన చెబితే.. చంపేస్తామని బెదిరించారు. బాలుడి ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా.. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అమానుషకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్ జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. అలీఘర్ జిల్లాలోని లోధా ప్రాంతంలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. తండ్రి తన కుమారుడికి డబ్బులు ఇచ్చి వ్యవసాయ ఉత్పత్తులు తీసుకురమ్మని దగ్గరలోని మార్కెట్‌కు పంపించాడు. బాలుడు ఒంటరిగా వెలుతున్నాడు. ఈ విషయన్ని గమనించిన ఇద్దరు మైనర్లు బాలుడిని అనుసరించారు. బాలుడిని సమీపంలోని అటవీ ప్రాంతంలోని తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే.. చంపేస్తామని బెదిరించారు. రూ.20 ఇచ్చారు. ఇంటికి వచ్చిన తరువాత బాలుడి ప్రవర్తనలో మార్పు రావడంతో.. ఆతల్లిదండ్రులు ఆరా తీశారు. ఆ నిందితులు ఇద్దరు తమ కుటుంబానికి బాగా తెలిసిన వాళ్లేనని తెలిసీ షాక్‌కు గురైయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.