ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్‌పూర్-బలోదబజార్ రోడ్డులోని సారగావ్ సమీపంలో రోడ్డుపై ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కును ట్రైలర్‌ను ఢీకొట్టడంతో 13 మంది మరణించారని పోలీసులు సోమవారం తెలిపారు. వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ ప్రకారం.. ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడ్డారు. వారిని చికిత్స కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు.
రాయ్‌పూర్ లాల్ పోలీసు సూపరింటెండెంట్ లాల్ ఉమ్మద్ సింగ్ మాట్లాడుతూ, ట్రక్కు చౌతియా చట్టి నుండి ఒక కార్యక్రమం తర్వాత తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో ట్రక్కులో చాలా మంది ఉన్నారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.