బస్సు-ఆటో ఢీ.. 13 మంది మృతి

13 killed as bus and auto-rickshaw collide in Madhya Pradesh's Gwalior. మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌లో మంగళవారం ఉద‌యం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో 13 మంది మృతిచెందారు.

By Medi Samrat  Published on  23 March 2021 4:08 AM GMT
13 killed as bus and auto-rickshaw collide in Madhya Pradesh’s Gwalior

రోడ్డు ప్ర‌మాదాలు క‌ట్ట‌డి కావ‌డం లేదు. ప్ర‌మాదాల నివార‌ణ‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్ని చ‌ర్య‌లు చేప‌డుతున్నా నిత్యం ఏదో మూల‌న ప్ర‌మాదాలు జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌లో మంగళవారం ఉద‌యం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో 13 మంది మృతిచెందారు.

వివ‌రాళ్లోకెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రం‌ గ్వాలియర్‌లోని ఓల్డ్‌ చావ్ని ప్ర‌దేశం.. ఆటో గ్వాలియర్‌ నుంచి మోరెనా రోడ్‌ వైపు చమన్‌ పార్క్‌ వైపు వెళ్తుండగా.. ఆటో బస్సును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మహిళలు సహా ఆటో డ్రైవర్‌ మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌లో మరికొంత మంది గాయపడగా.. వారిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు.

ఈ విష‌య‌మై గ్వాలియర్‌ ఎస్పీ అమిత్‌ సంఘీ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రంలో వంట చేసే మహిళలు తిరిగి ఇంటికి వస్తుండగా.. ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు. ప్ర‌మాద‌ స్థలంలోనే ఎనిమిది మంది మహిళలు, ఆటో డ్రైవర్‌ మృతి చెంద‌గా.. మిగితా న‌లుగురు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారని చెప్పారు. ఆటో వేగంగా బ‌స్సును ఢీకొట్టడంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామ‌న్నారు. ఘ‌ట‌న ప‌ట్ల‌ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. ప్ర‌మాదంలో‌ చ‌నిపోయిన కుటంబాలకు రూ. 4 ల‌క్ష‌లు, గాయ‌ప‌డిన రూ. 50వేల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు.



Next Story