దారుణం.. 12 ఏళ్ల బాలుడిపై గ్యాంగ్‌రేప్.. ప్రైవేట్ పార్టుల్లో రాడ్డుతో దాడి
12-year-old boy brutally raped in Delhi. ఈశాన్య ఢిల్లీలో దారుణం జరిగింది. పదేళ్ల బాలుడిపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గ్యాంగ్ రేప్ తర్వాత
By అంజి Published on 26 Sept 2022 8:09 AM ISTఈశాన్య ఢిల్లీలో దారుణం జరిగింది. పదేళ్ల బాలుడిపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గ్యాంగ్ రేప్ తర్వాత బాలుడి ప్రైవేట్ అవయవాల్లో రాడ్డుతో దాడి చేశారు. రాడ్డును దూర్చి ఇటుకలతో కొట్టారు. ఆ తర్వాత బాలుడిని కర్రలతో కొట్టి చంపేందుకు యత్నించారు. ఘటన తర్వాత బాలుడిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ప్రాణాలతో బయటపడిన బాలుడు ఢిల్లీలోని ఎల్‌ఎన్‌పిజే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. బాలుడిపై ముగ్గురు మైనర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, వారిలో ఒకరు అతని బంధువు అని తెలిసింది.
మైనర్ బాలుడి తల్లి.. తన బిడ్డపై అతని ముగ్గురు స్నేహితులు సెప్టెంబర్ 18, 2022 న శారీరకంగా దాడి చేసి అసహజ శృంగారం చేశారని పోలీసులకు సమాచారం అందించారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 6తో పాటు సెక్షన్ 377 (అసహజ సెక్స్), 34 (నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు చేయబడింది. బాధిత బాలుడు, నిందితులు ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారని, మైనర్ బాలుడితో నిందితులకు పరిచయం ఉందని తెలిసింది. ఇద్దరు నిందితులను పట్టుకుని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరచగా, పరారీలో ఉన్న మూడో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంపై ఢిల్లీ మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ ట్వీట్ చేస్తూ.. "ఢిల్లీలో అబ్బాయిలు కూడా సురక్షితంగా లేరని" అన్నారు. మహిళా ప్యానెల్ ఈ ఘటనను గుర్తించి ఢిల్లీ పోలీసులకు ఎఫ్ఐఆర్ దాఖలు చేసిందని స్వాతి పలివాల్ తెలిపారు. ''12 ఏళ్ల బాలుడిపై నలుగురు వ్యక్తులు అతి కిరాతకంగా అత్యాచారం చేసి, కర్రలతో కొట్టడంతో సగం చనిపోయాడు. మా బృందం ఈ విషయంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది'' అని స్వాతి పలివాల్ తెలిపారు.
दिल्ली में लड़की तो क्या लड़के भी सुरक्षित नहीं हैं। एक 12 साल के लड़के के साथ 4 लोगों ने बुरी तरह से रेप किया और डंडों से पीटकर अधमरी हालत में छोड़कर चले गए। हमारी टीम ने मामले में FIR दर्ज करवाई। 1 आरोपी गिरफ़्तार, 3 अब भी फ़रार, दिल्ली पुलिस को नोटिस जारी कर रही हूँ। pic.twitter.com/tXrqK7xkwm
— Swati Maliwal (@SwatiJaiHind) September 25, 2022