గర్భా ఈవెంట్‌ చూస్తున్న 11 ఏళ్ల బాలిక.. ఒక్కసారిగా తల్లోకి దూసుకెళ్లిన బుల్లెట్‌.. ఆ తర్వాత

11-year-old shot in head during Garba event in Indore. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 11 ఏళ్ల బాలిక తన తల్లితో కలిసి గర్బాను చూస్తున్నప్పుడు

By అంజి  Published on  6 Oct 2022 8:15 AM GMT
గర్భా ఈవెంట్‌ చూస్తున్న 11 ఏళ్ల బాలిక..  ఒక్కసారిగా తల్లోకి దూసుకెళ్లిన బుల్లెట్‌.. ఆ తర్వాత

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 11 ఏళ్ల బాలిక తన తల్లితో కలిసి గర్బాను చూస్తున్నప్పుడు.. గుర్తు తెలియని దుండగులు ఆమె తలపై కాల్పులు జరిపారు. ఈ ఘటన హిరా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మహి షిండే అనే 6వ తరగతి విద్యార్థిని ఉత్సవాల్లో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడింది. మృతురాలి కుటుంబీకులు మాట్లాడుతూ.. మహి తన తల్లి, తమ్ముడితో కలిసి శారదా నగర్‌లోని గర్బాను చూసేందుకు వెళ్లిన సమయంలో ఆమె తలపై కాల్పులు జరిపారు. గర్బాను చూస్తుండగా, అకస్మాత్తుగా ఆమెకు ఏదో తాకింది.

ఆమె తల నుండి రక్తం కారడం ప్రారంభించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఆమె బుల్లెట్ గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులకు కూడా సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతుండగా, గార్బా పండల్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఈ వ్యవహారంపై న్యాయమైన విచారణ జరిపిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. హీరా నగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ కమల్ కిషోర్ మాట్లాడుతూ.. బాలిక గర్బాను చూసేందుకు వెళ్లిందని కుటుంబీకులు చెప్పారు. బుల్లెట్ గాయాల కారణంగా చనిపోయింది. ఇంతలో మృతుడి తల్లి మాట్లాడుతూ.. ''మాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. నా కూతుర్ని ఎవరు చంపారో నాకు తెలియదు'' అని చెప్పారు.

Next Story