వాట్సప్ ద్వారా తండ్రిని బెదిరించి ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేసింది 11 ఏళ్ల బాలిక. ఒక వేళ డబ్బులు ఇవ్వకుంటే.. కొడుకును, కుమారైను చంపేస్తానని బెదిరించింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారని ఆందోళన చెందిన ఆ బాలిక తండ్రి.. పోలీసులను ఆశ్రయించాడు. చివరికి అసలు విషయం తెలిసి ఖంగుతిన్నాడు. ఈ ఘటన ఉత్తరప్రద్రేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గాజియాబాద్ లో శాలిమార్ గార్డెన్ ఏరియాలో ఓ కుటుంబం నివసిస్తోంది. ఆ కుటుంబంలోని 11 ఏళ్ల బాలికను ఇటీవల తల్లిదండ్రులు మందలించారు. దీంతో బాలిక తీవ్ర మనస్థాపానికి గురైంది. తండ్రి ల్యాప్‌టాప్ నుంచే ఆయనకు సందేశం పంపించింది. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే.. కుమారుడు, కుమారైను చంపేస్తానని బెదిరించింది. దీంతో బాలిక తండ్రి భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ల్యాప్ టాప్ నుంచే మెసేజ్ వచ్చిందని గుర్తించారు. మెసేజ్ చేసింది అతని కూతురేనని నిర్ధారించారు. దీంతో కుమారైను తండ్రి ప్రశ్నించగా.. తిట్టడం వల్లే ఈ పని చేసినట్లు బాలిక అంగీకరించింది. కాగా.. ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.