ఘోర ప్రమాదం.. లోయలో పడిన వాహనం.. 11 మంది దుర్మరణం
11 dead in Uttarakhand road accident.అదుపుతప్పి ఓ వాహనం లోయలో పడిన ఘటనలో 11 మంది దుర్మరణం చెందగా..
By తోట వంశీ కుమార్ Published on
31 Oct 2021 5:46 AM GMT

అదుపుతప్పి ఓ వాహనం లోయలో పడిన ఘటనలో 11 మంది దుర్మరణం చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. డెహ్రాడూన్ జిల్లాలోని వికాస్‌నగర్ వద్ద వాహనం అదుపు తప్పి లోయలో పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 11 మృతదేహాలను వెలికితీయగా.. మరో 4 నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story