Telangana: కేజీబీవీ స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట జిల్లా మునగాల మండలం నడిగూడెంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో 15 ఏళ్ల 10వ తరగతి విద్యార్థిని సోమవారం అర్ధరాత్రి తర్వాత తన తరగతి గదిలో ఆత్మహత్య చేసుకుంది.

By అంజి
Published on : 16 July 2025 6:31 AM IST

10th Class Student, Suicide, Telangana, KGBV School

Telangana: కేజీబీవీ స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట జిల్లా మునగాల మండలం నడిగూడెంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో 15 ఏళ్ల 10వ తరగతి విద్యార్థిని సోమవారం అర్ధరాత్రి తర్వాత తన తరగతి గదిలో ఆత్మహత్య చేసుకుంది. రాత్రి 10 గంటలకు స్టడీ అవర్‌ సమయం తర్వాత తన గదికి వెళ్లిందని ఆమె సహవిద్యార్థులు తెలిపారు. మంగళవారం ఉదయం, తరగతి గదిలో ఆమె మృతదేహాన్ని వారు కనుగొన్నారు. సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలానికి చెందిన ఆ విద్యార్థినిని 7వ తరగతి చదువుతున్నప్పుడు పాఠశాలలో చేరిందని పోలీసులు తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ పాఠశాలను సందర్శించి సిబ్బందిని, విద్యార్థులను సంఘటన గురించి విచారించారు.

ఆ విద్యార్థిని తన కుటుంబంలోని కొన్ని సమస్యలను నిద్రపోయే ముందు తన స్నేహితురాలితో పంచుకుందని, తల్లిదండ్రులు ఆదివారం బాధితురాలిని కలిశారని, సోమవారం ఉదయం ఆమె తండ్రి ఆమెను కలిశారని ఆయన అన్నారు. విద్యార్థిని జూలై 4న ఇంటికి వెళ్లి జూలై 7న పాఠశాలకు తిరిగి వచ్చిందని తండ్రి చెప్పాడు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోవడానికి ఎటువంటి సమస్యలు లేవని ఆయన అన్నారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఆత్మహత్యపై కేసు నమోదు చేసినట్లు నడిగూడెం సబ్ ఇన్‌స్పెక్టర్ గండమల్ల అజయ్ కుమార్ తెలిపారు. "మేము కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాము" అని ఆయన తెలిపారు.

Next Story