పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య.. ఎందుకంటే..?
10Th Class girl committed suicide in Bhoodan Pochampally.పదో తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు
By తోట వంశీ కుమార్
ఓ యువకుడి వేధింపులు భరించలేక పదో తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో చోటు చేసుకుంది.
పోచంపల్లి మండల పరిధిలోని జిబ్లక్‌పల్లి గ్రామంలో కావ్య(16) తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. చౌటుప్పల్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అదే గ్రామంలో ఉండే మాచర్ల శివమణి బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడంతో యాక్సెప్ట్ చేసింది. ఇక అప్పటి నుంచి తనను ప్రేమించాలంటూ తరచూ అతడు మెసేజ్‌లు పంపి వేధింపులకు గురి చేసేవాడు.
ఈ విషయాన్ని బాలిక తన అన్నకు చెప్పింది. బాలిక అన్న శివమణితో గొడవ పడ్డాడు. శివమణి బాలికకు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో మనస్థాపం చెందిన బాలిక డిసెంబర్ 31న పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందిన బాలిక జనవరి 2న డిశ్చార్జి అయి ఇంటికి వచ్చింది.
అదే రోజు గ్రామంలో పెద్ద మనషుల సమక్షంలో పంచాయతీ పెట్టి బాలికకు మరోమారు ఫోన్ చేయవద్దని ఒప్పందం కుదుర్చుకున్నారు. అయినప్పటికీ శివమణి నుంచి మెసేజ్‌లు ఆగకపోవడంతో కావ్య కలత చెందింది. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లిన తరువాత కావ్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకునే ముందు బాలిక సూసైడ్ నోట్ రాసింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.