టెంపోను ఢీకొన్న బస్సు.. 10 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఆదివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, టెంపో ఢీకొన్న ప్రమాదంలో 10 మంది మృతి చెందారు.

By అంజి
Published on : 18 Aug 2024 5:59 PM IST

bus tempo collision, Uttar Pradesh, Bulandshahr

టెంపోను ఢీకొన్న బస్సు.. 10 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఆదివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, టెంపో ఢీకొన్న ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టెంపోలో 25 మంది ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సేలంపూర్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందారు. నివేదికల ప్రకారం.. మరొక వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ప్రైవేట్ బస్సు టెంపోను ఢీకొట్టింది.

దీంతో టెంపో బోల్తా పడింది. క్షతగాత్రులను స్థానికుల సహాయంతో సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో టెంపో పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, బస్సు ముందు భాగం కూడా ధ్వంసమైంది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో రోడ్డుపై బైఠాయించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా పోలీసులు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ ప్రారంభించబడింది.

Next Story