ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న ఎస్‌యూవీ.. 10 మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తరి జిల్లాలో బుధవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో ట్రక్కును ఢీకొనడంతో ఒక కుటుంబంలోని
By అంజి Published on 4 May 2023 8:32 AM ISTఘోర ప్రమాదం.. ట్రక్కు ఢీకొన్న ఎస్‌యూవీ.. 10 మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తరి జిల్లాలో బుధవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో ట్రక్కును ఢీకొనడంతో ఒక కుటుంబంలోని కనీసం 10 మంది సభ్యులు అక్కడికక్కడే మరణించారు. రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా పలువురు గాయపడగా, మైనర్‌ను ఆస్పత్రికి తరలించారు. జగత్రా సమీపంలోని కంకేర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. కుటుంబం సొరం నుండి మర్కటోలాకు వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది. బలోద్ జిల్లాలోని జగత్రా సమీపంలో ట్రక్కు, కారు ఢీకొనడంతో 10 మంది మృతి చెందగా, ఒక చిన్నారికి తీవ్రగాయాలు అయ్యాయి.
Chhattisgarh |10 killed and one child seriously injured after a truck and car collided near Jagatra in Balod district. The injured has been referred to Raipur for better treatment. Search for the driver of the truck underway: Jitendra Kumar Yadav, SP Balod pic.twitter.com/imklW8bqlP
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 3, 2023
క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం రాయ్‌పూర్‌కు తరలించినట్లు ఎస్పీ బలోద్, జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ప్రాణనష్టంపై సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన బాలిక-పిల్లలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పురూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.