ఆటోను ఢీకొట్టిన ట్ర‌క్కు.. 10 మంది దుర్మ‌ర‌ణం.. సీఎం తీవ్ర దిగ్భ్రంతి

10 Chhath Puja Devotees Killed In Road Accident In Assam.అసోం రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆటోను ట్ర‌క్కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Nov 2021 6:20 AM GMT
ఆటోను ఢీకొట్టిన ట్ర‌క్కు.. 10 మంది దుర్మ‌ర‌ణం.. సీఎం తీవ్ర దిగ్భ్రంతి

అసోం రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆటోను ట్ర‌క్కు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఆటోలో ప్ర‌యాణీస్తున్న 10 దుర్మ‌ర‌ణం చెందారు. మృతుల్లో మ‌హిళ‌లు, చిన్నారులు, యువ‌కులు ఉన్నారు. ఈ ఘ‌ట‌న క‌రీంగంజ్ జిల్లాలోని బైత‌ఖ‌ల్ వ‌ద్ద చోటుచేసుకుంది.

ఛాట్ పూజ‌ను ముగించుకుని 10 మంది ఆటోలో స్వ‌స్థ‌లానికి వెలుతుండ‌గా.. గురువారం ఉద‌యం 7.30గంట‌ల స‌మ‌యంలో అసోం త్రిపుర జాతీయ ర‌హ‌దారి నెంబ‌ర్‌8 పై బైత‌ఖ‌ల్ వ‌ద్ద వీరు ప్రయాణీస్తున్న ఆటోను ఓ ట్ర‌క్కు వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. ప్ర‌మాదం ధాటికి మృత‌దేహాలు రోడ్డుపై చెల్లా చెదురుగా ప‌డిపోయాయి. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.

ఘ‌ట‌నాస్థ‌లంలోనే తొమ్మిది మంది చ‌నిపోగా.. ఒక‌రిని ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా చ‌నిపోయిన‌ట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ఛాట్ పూజ‌ను ముగించుకుని వెలుతున్న‌ట్లు చెప్పారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, ముగ్గురు పురుషులు ఉన్న‌ట్లు తెలిపారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

కాగా.. ఈ ఘటనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ తీవ్ర దిగ్భ్రంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్‌ను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని ట్వీట్ చేశారు.

Next Story