వీడిన మిస్టరీ: దీప్తిశ్రీ మృతదేహం లభ్యం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Nov 2019 6:38 PM ISTకాకినాడలో ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్ లో మిస్టరీ వీడింది. శుక్రవారం నుంచి కనిపంచకుండా పోయిన చిన్నారి మృతదేహాన్ని ఇంద్రపాలెం లాకుల వద్ద ధర్మాడి సత్యం బృందం గుర్తించింది. దీప్తిశ్రీని సవతితల్లి శాంతకుమారి కిడ్నాప్ చేసి ఆ తర్వాత హత్య చేసింది. పాప మృతదేహాన్ని మూటకట్టి ఇంద్రపాలెం వంతెన వద్ద పడేసినట్లు పోలీసుల విచారణలో తెలిపింది. చిన్నారి అదృశ్యం కేసు తర్వాత 48 గంటలకు మిస్టరీ వీడింది. ఇంద్రపాలెం వంతెన వద్ద చిన్నారి దీప్తిశ్రీ మృతదేహం లభ్యమైంది. చిన్నారి దీప్తి శ్రీని తానే హతమార్చి ఉప్పుటేరులో పడేశానని దీప్తిశ్రీ సవతి తల్లి శాంతి కుమారి తెలుపడంతో పోలీసులు రంగ ప్రవేశం గాలింపు చేపట్టగా, చివరకు మృతదేహం లభ్యమైంది.
ఆస్థి కోసమే...
ఆస్తి కోసమే సవతి తల్లి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. తనను, తన కుమారుడిని కాకుండా భర్త ఎక్కువగా దీప్తి శ్రీ మీద ప్రేమ చూపించటం, అలాగే దీప్తి శ్రీని చంపేస్తే ఆస్తి మొత్తం తనకు, తన కుమారుడికే ఉంటుందని భావించటం వల్ల ఆస్తి కోసమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక ఈ కేసులో శాంతకుమారికి ఎవరైనా సహకారం అందించారా? అన్న దానిపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. చిన్నారిని హత్య చేసిన శాంతకుమారి ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉంది.