హైదరాబాద్‌లో కరోనా పరీక్ష కేంద్రాల వివరాలు ఇవే..!
By సుభాష్ Published on 30 July 2020 12:05 PM GMTతెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. కరోనా పరీక్షల సంఖ్య పెంచడం లేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాలను పెంచింది తెలంగాణ సర్కార్. అయితే కరోనా పరీక్ష ఎక్కడ చేయించుకోవాలి అనే విషయం చాలా మందికి తెలియక తికమక పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా పరీక్షలు నిర్వహించే కేంద్రాల అధికారి జాబితాను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.
గ్రేటర్ పరిధిలోని పలు ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలతో పాటు ర్యాపిడ్ యాంటీజన్ టెస్టులను కూడా నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
పరీక్ష కేంద్రాల వివరాలు:
ప్రభుత్వ ఆస్పత్రులు, పరిశోధన సంస్థలు
గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రి, నిమ్స్, ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్, సీసీఎంబీ, సెంటర్ పర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్, డయోగ్నోస్టిక్స్, రైల్వే ఆస్పత్రి (లాలాగూడ).
ప్రైవేటు ల్యాబ్‌లు:
విజయ డయోగ్నోస్టిక్స్, మెఇసిన్ పాథ్‌ల్యాబ్స్, అపోలో ఆస్పత్రి (జూబ్లీహిల్స్), డాక్టర్ రెమిడీస్, సెల్ కరెక్ట్ డయోగ్నోస్టిక్స్, పాథ్‌కేర్, కిమ్స్, ఏఐజీ ఆస్పత్రి, అపోలో హెల్త్ కేర్ (సికింద్రాబాద్), యశోధ (సికింద్రాబాద్), కామినేని (మౌలాలి), అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ, మేగ్‌సేన్ డయోగ్నోస్టిక్స్, స్టార్ ఆస్పత్రి, గ్లనికల్ గ్లోబల్, కాంటినెంటల్ ఆస్పత్రుల్లో ల్యాబ్‌లు.
రంగారెడ్డి - అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, పీహెచ్‌సీలు
సరూర్‌నగర్, బాలాపూర్, అబ్దుల్లాపూర్‌మెట్, రంగనాయకకుంట, మన్సూరాబాద్, హఫీజ్‌పేట, రాయదుర్గం, ఆమన్‌గల్, యాచారం, కొత్తూరు, శేరిలింగంపల్లి.
మేడ్చల్ - ప్రభుత్వ ఆస్పత్రులు, బస్తీ దవాఖానాలు :
మల్కాజిగిరి (ఏరియా ఆస్పత్రి).
పీహెచ్‌సీలు : మేడ్చల్, అల్వాల్, బాలానగర్, మల్కాజిగిరి, ఉప్పల్, కుషాయిగూడ, శామీర్‌పేట, కీసర, నారపల్లి, దుండిగల్, జవహర్‌నగర్.
యూపీహెచ్‌సీలు:
మచ్చబొల్లారం, పర్వత్‌నగర్, మూసాపేట, సుభాష్‌నగర్, బొడుప్పల్, మేడ్చల్, ఫీర్జాదిగూడ, కొత్తపేట, చర్లపల్లి, నాగోలు, వెంకట్‌రెడ్డి నగర్, మల్లాపూర్, సఫిల్‌గూడ, జద్గిరిగుట్ట, ఎల్లమ్మబండ, హస్మత్‌పేట, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూరర్, షాపూర్‌నగర్, గాజులరామారం, సురారం కాలనీ, వనాయకనగర్, ఏకలవ్యనగర్, మౌలాలి.
బస్తీ దవాఖానాలు :
అంబేద్కర్‌నగర్, అంజయ్యనగర్ (బోయిన్‌పల్లి), బీజేఆర్‌నగర్, బాగ్‌మీరి కమ్యూనిటీ హాల్, బాలాజీనగర్ (మూసాపేట), చాకలి కుమ్మరి బస్తీ (కూకట్‌పల్లి), ఇందిరాగాంధీపురం, జీడిమెట్ల, కైత్లాపూర్, న్యూశివాలయ (సూరారం), రాజీవ్‌గాంధీనగర్ (మూసాపేట), వాల్వర్‌నగర్ (నాచారం), ఎల్లమ్మబండ, జింకల్‌వాడ (మూసాపేట), ఇందిరానగర్ (నాచారం), ఎల్‌ఎన్‌కాలనీ, మర్రిగూడ (మల్లారం), పెద్దచర్లపల్లి (కాప్రా), రాజీవ్‌నగర్ (కాప్రా),అంబేద్కర్‌నగర్ (కొత్తబస్తీ), అరుంధతి కమ్యూనిటీ హాల్ (అల్వాల్), మోడల్ మార్కెట్ (తుర్కపల్లి), ద్వారకానగర్ (కుత్బుల్లాపూర్), వివేక్‌నగర్ (రామాంతాపూర్), మహిళా మండలి భవన్ (కుషాయిగూడ), నందన్‌నగర్, భగత్‌సింగ్‌నగర్ (చింతల్), కేపీహెచ్‌బీ 5వ ఫేజ్, పాపిరెడ్డినగర్, వెంకటేశ్వర కమ్యూనిటీ హాల్, ఎర్రకుంట, ఎస్సీ కమ్యూనిటీహాల్ (చిల్కానగర్), సాయిబాబానగర్ (దమ్మాయిగూడ), సాయిరాం నగర్ కమ్యూనిటీ హాల్ (కుషాయిగూడ), అశోక్‌నగర్ (కాప్రా), సింగంచెరువు (కాప్రా), స్వామి వివేకానందనగర్ (కాప్రా).
హైదరాబాద్- ప్రభుత్వ ఆసుపత్రులు:
ఆయుర్వేద ఆస్పత్రి, నేచర్‌క్యూర్, సరోజినీదేవి నేత్ర వైద్యశాల, నిజామియా టిబ్బి ఆస్పతరి (చార్మినార్), మలక్‌పేట, నాంపల్లి, గోల్కొండ (ఏరియా ఆస్పత్రులు).
యూపీహెచ్‌సీలు :
బండ్లగూడ, బార్కస్, మైసారం, పార్వతీనగర్, ఉప్పుగూడ, బాలాగంజ్, చందులాల్ బారాదరి, తీగలకుంట, జహనుమా, చార్మినార్, ఉమ్డాబజార్, అలియాబాద్, నయాపూల్, తారామైదాన్, కామాటిపుర పంజేషా -2, డబీర్‌పురా, దారూషిఫా, అజంపురా, యాకుత్‌పురా -1 యాకుత్‌పురా -2, మలక్‌పేట, జాంబాగ్ పార్క్, మాదన్నపేట, గడ్డి అన్నారం, శ ఆలివాహననగర్, బ ఆగ్ అంబర్‌పేట, ముషీరాబాద్, భోలక్‌పూర్, ఎఎంఎస్, తిలక్‌నగర్, పురానాపుల్-1, పురానాపుల్-2, చింతల్‌బస్తీ, ఖైరతాబాద్, కుమ్మర్‌వాడి, ఫిల్మ్‌నగర్, గుడిమల్కాపూర్, కార్వాన్-1, గోల్కొండ, బొల్లారం, రసూల్‌పుర మొదలగునవి.
నిబంధనలు ఇవి..
ప్రభుత్వ ఆస్పత్రులు, బస్తీ దవాఖానాలు, యూపీహెచ్‌సీలలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారు. ప్రైవేటు ల్యాబ్‌లలో అయితే ఒక్కో ఆర్టీ-పీసీఆర్ పరీక్షకు రూ.2,300 చెల్లించాల్సి ఉంటుంది. అయితే పరీక్ష కేంద్రాల వద్ద పరీక్ష చేయించుకున్న వ్యక్తి చిరునామా, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ తప్పనిసరిగా నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. పరీక్ష చేయించుకున్న రోజు సాయంత్రం లేదా తర్వాత రోజు ఉదయానికి ఫలితాలు ఎస్‌ఎంఎస్ రూపంలో సంబంధిత వ్యక్తి మొబైల్ నెంబర్‌కు వస్తాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.