విద్యార్థులు ప్రయాణిస్తున్న స్కూల్ బస్సుపై దుండగుల దాడి
Thugs attack children's school bus in Punjab. విద్యార్థులు ప్రయాణిస్తున్న స్కూల్ బస్సుపై కొందరు దుండగులు దాడికి యత్నించారు. పదునైన కత్తులతో బైక్‌పై
By అంజి Published on 17 Aug 2022 8:30 AM GMTవిద్యార్థులు ప్రయాణిస్తున్న స్కూల్ బస్సుపై కొందరు దుండగులు దాడికి యత్నించారు. పదునైన కత్తులతో బైక్‌పై వచ్చిన దుండగులు బస్సును వెంబడించారు. బస్సు డ్రైవర్‌పై దాడి చేశారు. దీంతో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ చాకచాక్యంగా వ్యవహరించి బస్సును స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని బర్నాలాలో జరిగింది. కొందరు తనపై ప్రతీకారంతోనే ఈ చర్యకు పాల్పడ్డారని బస్సు డ్రైవర్ చెప్పాడు.
పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన జరిగిన విషయాన్ని బస్సు డ్రైవర్ పోలీసులకు చెప్పాడు. కొద్ది రోజుల కిందట కొందరు వ్యక్తులు తన గొడవకు దిగారని చెప్పాడు. ఈ క్రమంలోనే వారు తనపై దాడికి పాల్పడ్డారని చెప్పాడు. బస్సును ఆపాలంటూ నిందితులు వెంటపడ్డారని, పదునైన కత్తులతో తనపై దాడి చేశారని బస్సు డ్రైవర్ తెలిపారు. దుండగులు బస్సును ఆపి, దిగమని కోరగా, బస్సు దిగిన వెంటనే పదునైన ఆయుధంతో బస్సు డ్రైవర్‌పై దాడి చేశారు. దాడి జరిగిన సమయంలో స్కూల్ బస్సులో చిన్నారులు ఉన్నారు.
వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును సమీపంలోని డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లాడు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు డీఎస్పీ బర్నాలా తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత బస్సులో ఉన్న పిల్లలను సురక్షితంగా వారి ఇంటికి పంపించారు. బస్సు డ్రైవర్‌ను విచారించిన పోలీసులు.. పాత కక్షలతోనే గొడవ పడినట్లు గుర్తించారు. బస్సుపై దాడికి యత్నించిన వారిలో ఒకరిని ఇప్పటికే పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు. నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.