14 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం.. కాళ్లు విరగొట్టి, నిర్జన ప్రదేశంలో పడేసి..
A 14-year-old girl was brutally beaten by an auto driver for resisting a rape attempt. అత్యాచార యత్నాన్ని ప్రతిఘటించిన 14 ఏళ్ల బాలికను ఓ ఆటో డ్రైవర్ దారుణంగా కొట్టాడు. బాలిక పాక్షికంగా అపస్మారక
By అంజి Published on 22 Aug 2022 7:24 AM ISTఅత్యాచార యత్నాన్ని ప్రతిఘటించిన 14 ఏళ్ల బాలికను ఓ ఆటో డ్రైవర్ దారుణంగా కొట్టాడు. బాలిక పాక్షికంగా అపస్మారక స్థితిలోకి చేరుకున్న తర్వాత.. ఆమెను ఓ నిర్జన ప్రదేశంలో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో జరిగింది. బాలిక ముఖంపై పలు గాయాల గుర్తులు కూడా కనిపించాయి. ఆమె ఒక కాలు విరిగిపోవడంతో ఒక రాత్రి మొత్తం నిర్మానుష్య ప్రాంతంలో గడిపింది. మరుసటి రోజు ఎలాగోలా పాకుకుంటూ మెల్లగా రోడ్డుపైకి వచ్చిన బాలిక.. స్థానికుల సహాయం కోరింది.
వెంటనే బాలికను కొందరు ఆస్పత్రి చేర్పించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఆ బాలికతో పాటు ఆమె అమ్మమ్మ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. మేనమామ ఇంటికి వెళ్తుండగా తనపై ఓ ఆటో డ్రైవర్ అత్యాచారం చేసినట్లు బాధితురాలు తెలిపింది. ప్రస్తుతం బాలిక దుమ్కా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందుతుడి కోసం గాలిస్తున్నారు.
దుమ్కా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్.. నూర్ ముస్తఫా అన్సారీ మాట్లాడుతూ.. ''ఈ నేరం గుర్తు తెలియని వ్యక్తి చేసాడు. ఈ మేరకు కేసు నమోదు చేశాం. గుర్తు తెలియని నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.'' అని చెప్పారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సిడబ్ల్యుసి) మేజిస్ట్రేట్ బెంచ్ ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ అమరేంద్ర కుమార్, మహిళా సభ్యుడు నూతన్ బాలా, సభ్యుడు డాక్టర్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ ఆదివారం ఆస్పత్రిని సందర్శించి బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
వివరాల ప్రకారం.. జిల్లాలోని రామ్‌గఢ్ ప్రాంతంలోని తన మేనమామ ఇంటికి వెళ్లేందుకు బాలిక శనివారం మధ్యాహ్నం 3.40 గంటలకు బసుకినాథ్ బస్టాండ్‌కు చేరుకుంది. ఆమెను గమ్యస్థానానికి తీసుకెళ్తానని ఓ ఆటో డ్రైవర్ ముందుకొచ్చాడు. ఆమె ఆటోలో కూర్చుంది. అందులో మరొక అమ్మాయి అప్పటికే కూర్చుంది. అరగంట రైడ్ చేసిన తర్వాత డ్రైవర్ వారిని ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లి వారితో సరసాలాడటం ప్రారంభించాడు. మరో యువతి తప్పించుకోగలిగింది. కానీ బాలిక పారిపోలేకపోయింది. డ్రైవర్ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు.
''నేను అతని అత్యాచార ప్రయత్నాన్ని ధిక్కరించడంతో.. ఆ వ్యక్తి నన్ను స్పృహతప్పి పడిపోయే వరకు కర్రతో దారుణంగా కొట్టాడు. అతను నన్ను ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు పక్కన పడేశాడు. రాత్రంతా అక్కడే పడుకున్నాను. ఆదివారం ఉదయం కాస్త ధైర్యం తెచ్చుకుని రోడ్డు వరకు నా కాళ్లను ఈడ్చుకెళ్లి సహాయం కోసం ప్రజలకు కోరాను'' అని ఆ బాలిక తెలిపింది. అనంతరం స్థానికులు మహిళా పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించగా ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.