ఢిల్లీ: కరోనాను అరికట్టేందుకు అమిత్‌ షా కీలక నిర్ణయం

By సుభాష్  Published on  14 Jun 2020 11:48 AM GMT
ఢిల్లీ: కరోనాను అరికట్టేందుకు అమిత్‌ షా కీలక నిర్ణయం

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కాలరాస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కరోనాను అరికట్టేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో జరిగిన సమావేశం ముగిసింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని అమిత్‌ షా తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కట్టడికి కేంద్రం కట్టుబడి ఉందని, రెండు రోజుల్లో ఢిల్లీలో కోవిడ్‌ పరీక్షలను రెట్టింపు చేస్తామని స్పష్టం చేశారు. ఆరెర రోజుల్లో కరోనా పరీక్షలను మూడింతలు చేస్తామన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. కంటైన్మెంట్‌జోన్‌లో ప్రతిఇంట్లో సర్వే చేయాలని ఆయన ఆదేశించారు. ఆ జోన్లలో ఉన్నవాందరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో కరోనా పరీక్షా కేంద్రాలు

పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో కరోనా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అమిత్‌ షా తెలిపారు. కరోనా బాధితులకు బెడ్ల కోసం 500 రైల్వే కోచ్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

కరోనా మృతుల అంత్యక్రియలపై గైడ్‌లైన్స్‌ రూపొందిస్తాం..

అలాగే కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలకు సంబంధించిన కొత్త గైడ్‌లైన్స్‌ రూపొందిస్తామన్నారు. ఢిల్లీలో కరోనాను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా ఐదుగురు అధికారులను నియమిస్తామన్నారు. కరోనా పోరులో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, స్వచ్ఛంద సంస్థల సేవలు వాడుకుంటామని అన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు 60 శాతం బెడ్లు తక్కువ ధరకే ఇవ్వాలని కోరారు. ఇక కరోనా చికిత్స, పరీక్షల ధరలపై డాక్టర్‌ పాల్‌ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

Next Story